
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్య రిత్యా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఫోన్ ట్యాపింగ్‌కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయి చేశారు.
వైద్యం కోసం అమెరికాకు వెళ్లినట్లు నాంప్లలి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశారు. కేసు దర్యాప్తు కోసం పూర్తిగా సహకరిస్తానని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment