ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం... పిటిషన్ విచారణ అర్హతను ప్రశ్నించింది. పిటిషన్పై విచారణ చేపట్టాలంటే రెండు వారాల్లోగా రూ.లక్ష డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.