
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు కేటాయించడంలేదని వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ కోరినప్పటికీ తానే పోటీ చేయడం లేదన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార బాధ్యతలు ఉండడం వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తానని వాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment