
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు.
విజయశాంతి తన ట్వీట్‌లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్‌లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్‌ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్‌కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్‌లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా..
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023
ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్‌కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు… pic.twitter.com/Z7it3d7oKc