చుక్‌చుక్ రైలు వస్తోంది...అందరు రండి: రాములమ్మ
రైల్వే స్టేషన్ శంకుస్థాపనకు రాములమ్మ ఆత్మీయ ఆహ్వానం
మెదక్: చుక్‌చుక్ రైలు వస్తోంది..మీరందరూ రండి అంటూ ఈనెల 19న కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున్ కార్గె చేతుల మీదుగా మెదక్‌లో జరిగే రైల్వేస్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి మెదక్ ఎం పీ విజయశాంతి శుక్రవారం ఆత్మీయ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. మూడు దశాబ్దాల రైల్వేలైన్ కల సాకారమవుతున్న వేళ పార్టీలకతీతంగా పిల్ల లు, పెద్దలు, అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు, యువకులు, పెద్దలు అధిక సం ఖ్యలో తరలివచ్చి శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కో రారు. ఈ మేరకు ఆమె బహిరంగ ఆ హ్వాన పత్రికను విడుదల చేశారు.
ఆ ఆహ్వాన పత్రంలో ఎంపీ ఇలా పేర్కొన్నారు..‘‘మెదక్ ప్రజల చిరకాల ఆకాం క్షకు అనుగుణంగా రైల్వేలైన్ కోసం శక్తి వంచన లేకుండా భగీరథయత్నం చేశాను. పార్టీలకతీతంగా ఉద్యమకారులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైల్వేలైన్ మంజూరైంది. నా రాజకీయ జీవితంలో ఎంపీ అయిన తర్వాత సంబరంగా జరుపుకునే సం క్రాంతి ఇది. మెదక్ ప్రాంత ప్రజలు రెలైక్కితేవారి ముఖాల్లో కనిపించే అనందాన్ని చూడాలన్న ఆకాంక్షతో, ఆ క్షణాల కోసం రాములక్కగా నేను ఎదురు చూస్తున్నాను. ఇదే నా ఆహ్వానంగా భావించి మెదక్ ప్రాంత ప్రజలంతా భారీ సంఖ్యలో తరలి రావాలి’’.