సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: హరీశ్రావు | Welcomes Central Bureau of Investigation enquiry, says Harish rao | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: హరీశ్రావు

Published Fri, Apr 25 2014 1:41 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: హరీశ్రావు - Sakshi

సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: హరీశ్రావు

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మెదక్ ఎంపీ విజయశాంతిలతోపాటు తన ఆస్తులపై నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రకటించారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మెదక్ ఎంపీ విజయశాంతిలతోపాటు తన ఆస్తులపై నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం హరీశ్రావు హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ కుట్రలో భాగంగానే సీబీఐ విచారణ అని ఆరోపించారు. మాట వినని పార్టీలను దారిలోకి తెచ్చుకునేందుకు... కాంగ్రెస్ పార్టీ సీబీఐను వాడుకుంటోందని ఆయన విమర్శించారు. తన అవసరాల కోసం సీబీఐను వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని హారీశ్ రావు గుర్తు చేశారు.

కేసీఆర్తో పాటు విజయశాంతి, హరీష్రావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ బాలాజీ వధేరా అనే న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తోపాటు ఆయన మేనల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ముగ్గురూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వధేరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీబీఐ కోర్టు ఆ ముగ్గురి ఆస్తులపై విచారణ జరపాలని శుక్రవారం ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement