
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనే పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ సిద్ధం చేసింది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు అందజేశారు.
మంత్రులు కొప్పు ల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయతో పాటు ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, చల్లా ధర్మారెడ్డి, వి.సతీశ్ కుమార్, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డిలు కూడా పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయనున్నారు.
(చదవండి: Cyclone Shaheen: తరుముకొస్తున్న షహీన్)
Comments
Please login to add a commentAdd a comment