
తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధిం చిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండు గ తెలుగు ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. లోకాన్ని రక్షించే దుర్గామాత ప్రజలందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు.