హైదరాబాద్: విజయదశమి సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషదాయకమైన దసరా పర్వదినాన మానవాళిపై దుర్గామాత తన చల్లని ఆశీర్వచనాలను కురిపించాలని ఆకాంక్షించారు.
ఆనందాన్ని పంచాలి: సీఎం కిరణ్
రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాలలోని తెలుగువారందరికీ సీఎం కిరణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు దసరా పండుగ ఆనందాన్ని పంచాలని ముఖ్యమంత్రి తన సందేశంలో అభిలషించారు.
కొత్త వెలుగులు నింపాలి: జగన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
గవర్నర్ దసరా శుభాకాంక్షలు
Published Mon, Oct 14 2013 1:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement