బతుకమ్మ ఊరేగింపు
హైదరాబాద్: తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అంతా బతుకమ్మ పాటలతో మారుమ్రోగుతోంది. ఎల్బి స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ఈ సాయంత్రం ప్రారంభమైంది. ఎంపి కవిత ఊరేగింపును ప్రారంభించారు. పది వేల బతుకమ్మలు ట్యాంక్బండ్ వద్దకు బయలుదేరాయి. ట్యాంక్బండ్ జనసంద్రమైంది. మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ట్యాంక్బండ్ పరిసరాలలో బతుకమ్మల పాటలే వినవస్తున్నాయి.బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఆటపాటలతో సంబరాలు ఘనగా కొనసాగుతున్నాయి. దాండియా, కోలాటాలు, పాటలతో ట్యాంక్బండ్పై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దంపతులు ట్యాంక్బండ్ చేరుకున్నారు. ఈ దంపతులు ఆనందంగా బతుకమ్మ ఆడారు.
**