సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం 4 నుంచి ఈ కింద తెలిపిన ప్రాం తాల్లో అవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని అనురాగ్ శర్మ కోరారు.
సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్, చిల్డ్రన్స్ పార్క్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్/తెలుగుతల్లి ఫ్లైఓవర్/అంబేద్కర్ స్టాట్యూ మీదుగా మళ్లిస్తారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ స్టాట్యూ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వరకు ట్యాంక్‌బండ్‌పై కుడివైపు మాత్రమే అనుమతిస్తారు.
ఖెరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్‌గలోని వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి ఐ-మాక్స్, సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, మింట్, పీపుల్స్ ప్లాజా వైపు పంపిస్తారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వైపు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోకి వెళ్లే వాహనాలను ఐ-మాక్స్, సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, మింట్ మీదుగా ఖైరతాబాద్ వైపు పంపిస్తారు. సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, మింట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు.
బతుకమ్మ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
Published Sat, Oct 12 2013 4:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement