బతుకమ్మ వస్తోంది.. దారివ్వండి! | Traffic restrictions in many parts of the city today | Sakshi
Sakshi News home page

బతుకమ్మ వస్తోంది.. దారివ్వండి!

Published Thu, Sep 28 2017 2:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Traffic restrictions in many parts of the city today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పర్‌ ట్యాంక్‌బండ్, ఎల్బీ స్టేడియంల్లో గురువారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ ఎం.మహేందర్‌రెడ్డి బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. సం దర్శకులు, ఆహుతుల కోసం ప్రత్యేక పార్కిం గ్‌ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

♦ సికింద్రాబాద్‌ వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్, బైబిల్‌ హౌస్‌ నుంచి కవాడిగూడ, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వైపు మళ్లిస్తారు.
♦  కట్టమైసమ్మ, కవాడిగూడ వైపు నుంచి చిల్డ్రన్స్‌ పార్క్‌ వైపు వచ్చే వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ నుంచి కవాడిగూడ వైపు పంపిస్తారు.
♦  ఇక్బాల్‌ మీనార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.
♦ ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం చౌరస్తా వైపు ట్రాఫిక్‌ అనుమతించరు. వీటిని నాంపల్లి/ రవీంద్ర భారతి వైపు పంపిస్తారు.
♦  ఎస్బీఐ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం చౌరస్తా, బషీర్‌బాగ్‌ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ, చాపెల్‌రోడ్‌ మీదుగా పంపిస్తారు.
♦  ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ ‘వై’జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
♦  కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్స్‌ మీదుగా బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్‌ హోటల్‌ వైపు పంపిస్తారు.
♦  ఓల్డ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు మళ్లిస్తారు.
♦  హిల్‌ఫోర్ట్‌ రోడ్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు పంపిస్తారు.
♦  హిమాయత్‌ నగర్‌ వై జంక్షన్‌ నుంచి లిబర్టీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వైపు మళ్లిస్తారు.
♦ పంజగుట్ట, రాజ్‌భవన్‌ వైపుల నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ సర్కిల్‌ వరకే అనుమతిస్తారు నల్లగుట్ట జంక్షన్‌–బుద్ధభవన్‌ మధ్య వాహనాలను అనుమతించరు.


పార్కింగ్‌ ప్రాంతాలివే...
♦ మెహిదీపట్నం, కార్వాన్, ఖైరతాబాద్‌ వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారు ఆయకార్‌ భవన్‌ వద్ద దిగాలి. ఈ వాహనాలను ఎన్టీఆర్‌ స్టేడియంలో పార్క్‌ చేసుకోవాలి.
♦ ముషీరాబాద్, అంబర్‌పేట, బేగంపేట వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారు బీజేఆర్‌ విగ్రహం చౌరస్తా వద్ద దిగాలి. ఈ వాహనా లకూ ఎన్టీఆర్‌ స్టేడియమే పార్కింగ్‌.
♦ జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, గోషా మహల్‌ వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారి ఏఆర్‌ పెట్రోల్‌పంప్‌ వద్ద దిగాలి. వాహనాలను ఎన్టీఆర్‌ స్టేడియంలోనే పార్కింగ్‌ చేసుకోవాలి.
♦ వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు బీజేఆర్‌ విగ్రహం వద్ద వాహనాలు దిగాలి. వాహనాలను ఆలియా కాలేజ్, మహబూ బియా కాలేజ్‌ల్లో పార్క్‌ చేసుకోవాలి.
♦ మంత్రులు స్టేడియం డి గేట్‌ వద్ద వాహనం దిగాలి. వాహనాలను ఆలియా కాలేజ్‌లో పార్క్‌ చేసుకోవాలి.
♦ మీడియా ప్రతినిధులు సైతం డి గేట్‌ వద్దే వాహనం దిగాలి. వాహనాలను సచి వాలయంలో పార్కింగ్‌ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement