అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
రాయికల్ : అబుదాబిలోని ఇండియన్ సోషల్ సెంటర్‌లో శనివారం బతుకమ్మసంబరాలు అంబరాన్నంటాయి. అబుదాబీ, షార్జా, దుబాయ్, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మలను తీసుకువచ్చి గౌరీపూజ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. నిర్వాహకులు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పావని, అర్చన, రోజా, పద్మజ, లక్ష్మీ, లత, నాయకులు రాజ శ్రీనివాస్, పృథ్వీ, వంశీ, గంగారెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.