ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండగ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు ఎల్బీ స్టేడియం, బషీర్ బాగ్, అంబేద్కర్ విగ్రహాల వైపుకు వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ జితేందర్ మీడియాకు తెలిపారు.