IRL: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు | Hyd: Traffic curbs due to Indian Racing League at NTR Marg | Sakshi
Sakshi News home page

సాగర ఒడ్డున మళ్లీ రయ్‌.. రయ్‌.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Fri, Dec 9 2022 11:01 AM | Last Updated on Fri, Dec 9 2022 11:09 AM

Hyd: Traffic curbs due to Indian Racing League at NTR Marg - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున మళ్లీ సందడి చేయనుంది. శనివారం, ఆదివారం ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నిర్వహణ ఉండనుంది.  ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ప్రకటించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు వర్తించనున్నాయి.

గత నెలలో జరిగిన పోటీలు.. అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌, నెక్లెస్‌రోడ్‌ మూసివేస్తారు. బుద్ధభవన్‌, నల్లగుట్ల జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌, ఐమాక్స్‌ వైపు వాహనాలకు నో ఎంట్రీ అమలు కానుంది

అనుమతులు..
► విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లే ట్రాఫిక్‌ను షాదాన్‌ కాలేజ్‌, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు.

► బుద్ధభవన్‌/నల్లగుట్ట జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతిస్తారు.

► రసూల్‌పురా/మినిస్టర్‌ రోడ్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.

► ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.

► ట్యాంక్‌బండ్‌/తెలుగుతల్లి నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్‌మి నార్‌, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు.

► బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్‌మినార్‌, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.

► ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వైపు అనుమతిస్తారు.

► ఖైరతాబాద్‌ బడాగణేశ్‌ వీధి నుంచి ప్రింటింగ్‌ ప్రెస్‌ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను రాజ్‌దూత్‌ వైపు అనుమతిస్తారు.

ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌రోడ్‌, లుంబినీ పార్క్‌లు ఈ నెల 9 నుంచి ఈ నెల 11 వరకు మూసి ఉంటాయి.

శని, ఆదివారాల్లో హుస్సేన్‌ సాగర్‌ తీరం నెక్లెస్‌ రోడ్డులోని 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై రేసింగ్‌ కార్లు దూసుకెళ్లనున్నాయి. శనివారం 2 క్వాలిఫయింగ్‌ సెషన్‌లు, ఒక స్ప్రింట్‌ రేసు జరగనుంది. అలాగే ఆదివారం ఒక స్ప్రింట్‌, మరో ఫీచర్‌ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ తొలి రౌండ్‌ జరిగింది. ఆ సమయంలో.. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్‌, గోవా ఏసెస్‌ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement