చేర్యాల (సిద్దిపేట): అఖిలపక్షం నేతలు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతుల మేలు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సమ న్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ చైర్మన్ కోదండరాం అఖిలపక్షం పేరుతో సత్యాగ్రహం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతు సమితుల్లో గ్రామంలోని ప్రతి రైతుకు భాగస్వామ్యం ఉంటుందని, ముఖ్యంగా పంటకు మద్దతు ధర నిర్ణయిం చడం, భూపరమైన సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి తదితర ఆంశాలపై సమన్వయ సమి తుల నిర్ణయం ఉంటుందని మంత్రి వివరిం చారు. గత పాలకులు ఎవరూ చేయని విధం గా రైతుల కోసం రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్, మిషన్ కాకతీయ వంటి ఎన్నో రైతు సంక్షేమ కార్య క్రమాలు తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాంలు పిల్లికి ఎలుక మీద ప్రేమలాగా రైతులపై కపట ప్రేమ ఉన్నట్లు నటించడం సరికాదన్నారు.
ఏమి హాయిలే హలా..
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సద్దుల బతుకమ్మ పండుల వేళ మంత్రి హరీశ్‌రావు కుటుంబం గురువారం సిద్దిపేటలో సందడి చేసింది. హరీశ్‌రావు, ఆయన భార్య శ్రీనిత ఉదయం నుంచి పట్టణంలో తిరుగుతూ బతుకమ్మ వేడులను తిలకించారు. సాయంత్రం కోమటిచెరువు వద్ద జరిగిన నిమజ్జనోత్సవా నికి హాజరయ్యారు. మంత్రి దంపతులు బోటులో చెరువులో విహరించారు.