స్వరాష్ట్రంలో సంప్రదాయాలకు బ్రహ్మరథం
-
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పండుగలపై చిన్నచూపు
-
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
హన్మకొండ : సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పాలకులు చిన్నచూపు చూశారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రం తెలంగాణలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి సీఎం కె.చంద్రశేఖర్‌రావు మహిళలకు కానుకగా ఇచ్చారన్నారు. వేడుకల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించి మహిళలు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గురువారం హన్మకొండలోని వడ్డేపల్లి, కలెక్టరేట్, హనుమాన్ నగర్‌లో స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో కలిసి డిప్యూ టీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి బతుకమ్మ ఆడారు. అంతకుముందు వడ్డేపల్లిలోని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్వగృహం వద్ద వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సతీమణి దాస్యం రేవతితో కలిసి రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చారు. ఈసందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడు తూ పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు మిడిదొడ్డి స్వప్న, నల్ల స్వరూపారాణి, కేశబోయిన అరుణ, మాధవీరెడ్డి, సోబియా సబాహత్, చింతల యాదగిరి, టీఆర్‌ఎస్ నాయకులు ఎల్లావుల లలితా యాదవ్, కొమురవెల్లి శ్రీనివాస్, శ్రీధర్, కె.లలిత, ఎడవెల్లి విజయ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.