పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రమంతా సమర్థిస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంశంపై ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, మైనార్టీ శాసనసభ్యులు, 13 జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.