
సాక్షి,వైఎస్‌ఆర్‌జిల్లా: కడపలో సోషియల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ నాయకులు భరోసా ఇచ్చారు. సోషియల్ మీడియా కో కన్వీనర్ నిషాంత్, దుర్గా ప్రసాద్‌తో పాటు పలు కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆదివారం(నవంబర్17) పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ‘ గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను నోటీసుల పేరుతో పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అర్థరాత్రి సమయాల్లో ఇళ్లకు వస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’అని తెలిపారు.