consoles
-
సోషల్‌మీడియా కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ నేతల భరోసా
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో సోషియల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు భరోసా ఇచ్చారు. సోషియల్ మీడియా కో కన్వీనర్ నిషాంత్, దుర్గా ప్రసాద్‌తో పాటు పలు కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆదివారం(నవంబర్17) పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ‘ గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నోటీసుల పేరుతో పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అర్థరాత్రి సమయాల్లో ఇళ్లకు వస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’అని తెలిపారు. -
అండగా నేనున్నా
సాక్షి తిరుపతి: అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానంటూ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతన్నకు జరిగిన అపార నష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తీసుకొచ్చిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు వేళ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందన్నారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ తొలుత తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలాల్లోని తుపాన్ బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కోట మండలం విద్యానగర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చేరుకుని కోతకు గురైన స్వర్ణముఖి నది, వరి పంటలను పరిశీలించారు. స్వర్ణముఖి కోతకు గురి కావటానికి కారణాలను ఆరా తీశారు. బాలిరెడ్డిపాళెంలో తుపాను బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. చెప్పలేనంత బాధగా ఉంది.. 'ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు జిల్లా మొత్తం సగటుతో పోల్చుకుంటే అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిసింది. దాదాపు 40 – 60 సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి. మనందరికీ జరిగిన ఈ నష్టం, కష్టం చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 92 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 8,364 మందిని తరలించాం. 25 కిలోల రేషన్ బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, లీటరు పామాయిల్ చొప్పున దాదాపు 60 వేల మందికి పైగా బాధితులకు అందచేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది.. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ. అందువల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని సీఎం జగన్ తెలిపారు. 'ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చి చెబుతున్నా. నాకు నష్టం జరిగింది.. కానీ ఎదుటివాడికి మాత్రమే సాయం వచ్చింది.. నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ఏ ఒక్కరినీ నష్ట పోనివ్వం. ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచి్చన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఇవాళ మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 చొప్పున డబ్బులిచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళతారు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఊరట. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందచేస్తాం. అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ రోజు నుంచి వారంలోగా ప్రతి ఒక్కరికీ జరగాల్సిన మంచి జరుగుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు. రెట్టించిన వేగంతో యంత్రాంగం 'తుపాన్ ప్రాంతాల్లో విద్యుత్తును చాలా వేగంగా పునరుద్ధరించారు. యంత్రాంగం అంతా ఇక్కడే నిమగ్నమై రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో విద్యుత్తు లేని పరిస్థితి ఉంటే వలంటీర్ల ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్లు సమస్యను పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మరోసారి చెబుతున్నా. ' అని అన్నారు. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌రెడ్డి, తానేటి వనిత, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీదే.. 'ఇక్కడికి రాకముందు స్వర్ణముఖి నదిలో కోత కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో స్వయంగా చూశా. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలని చెప్పా. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ సమస్యను తీరుస్తూ హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా. జిల్లాలో 110 చెరువులు ఉండగా కొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. రోడ్లు మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.32 కోట్ల ప్రతిపాదనలు అందాయి. యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది. అంతేకానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్యైనా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వెంటనే ‘జగనన్నకు చెబుదాం’ 1902 నంబర్‌కు ఫోన్ కొట్టండి. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. తుపాన్ బాధిత ప్రాంతాల్లో అందరికీ అన్నీ అందించే బాధ్యతను కలెక్టర్ తీసుకుంటారు. నాలుగైదు రోజుల్లో వారి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్ -
మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ ప్రముఖ రాజకీయవేత్త నుంచి చాలా విషాయాలు నేర్చుకున్నానని చెప్పారు. సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) నేత 75 ఏళ్ల శరద్ యాదవ్ గురుగ్రామ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ శరద్ యాదవ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా నానమ్మ ఇందిరా గాంధీతో రాజకీయ పోరాటం చేశారని, వీరిద్దరూ గౌరవం, ఆప్యాయతలతో మెలిగేవారిని గుర్తు చేసుకున్నారు. అంతేగాదు యాదవ్ ఎప్పుడూ ఇతరుల గౌరవాన్ని కోల్పోలేదని, ఇది రాజకీయాలలో అతి గొప్ప విషయమని అన్నారు. శరద్ యాదవ్ సోషలిజం నాయకుడిగా ఉండటమే గాక వినయశీలి. తాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, దేశానికి ఆయన చేసిన కృషి, సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రో ఉన్న రాహుల్ శుక్రవారం యాత్రకు విరామం ఇచ్చి మరీ పంజాబ్ నుంచి ఢిల్లీ చేరుకుని శరద్‌యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. (చదవండి: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత) -
కఠిన చర్యలు తీసుకుంటాం: అంజాద్ బాషా
-
నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులను సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. (సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) అబ్దుల్ సలామ్ ఘటనపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రత్యేక అధికారుల ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడుతుంది. వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలకుండా దర్యాప్తు జరుగుతంది అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా వెల్లడించారు. కాగా గతంలోనే సామూహిక ఆత్మహత్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య) -
సీఎం పళనిస్వామిని పరామర్శించిన ఆర్కే రోజా
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామిని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. సీఎం ఎడపాడి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సీఎంను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా నేతలు గ్రీన్‌వేస్ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్, సినీ నిర్మాత ఆర్బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు. ముందుగా భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా అక్కడకు వచ్చారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొంతసేపు పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతి తెలియజేశారు. వీరులకు వందనం.... సాయంత్రం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరులకు వందనం సమర్పించే కార్యక్రమం జరిగింది. బుధవారం పోలీసు సంస్మరణ దినోత్సవం. ఈసందర్భాన్ని పురష్కరించుకుని ఇప్పటి వరకు విధుల్లో అమరులైన పోలీసుల పేర్లు, వివరాలను పొందు పరుస్తూ డీజీపీ కార్యాలయం ఆవరణలో శిలాఫలకాన్ని రూపొందించారు. దీనిని సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. అలాగే, అక్కడ ఓ మొక్కను నాటారు. డీజీపీ కార్యాలయంలో పోలీ సుల అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్, డీజీపీ త్రిపాఠి, చెన్నై పోలీసుకమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు. -
బోస్‌ను పరామర్శించిన విజయమ్మ
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిళ, బ్రదర్ అనిల్ ఫోన్లో పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఫోన్లో పరామర్శించారు. ఇటీవల పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. (ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం) -
చినజీయర్ స్వామికి టీటీడీ చైర్మన్ పరామర్శ
సాక్షి, తిరుమల: శ్రీత్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి జీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన మాతృమూర్తి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు సీఎం ఫోన్‌కాల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కరోనాతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఫోన్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఫోన్ చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే దొరబాబుకు సీఎం జగన్ పరామర్శ) మెరుగైన చికిత్సకు బెంగళూరుకు.. కాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా కరోనాతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆదివారం ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు తరలించారు. -
జవాన్ల త్యాగాలు వృథా పోవు: కిషన్‌రెడ్డి
సాక్షి, సూర్యాపేట: దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా దేశానికి, సైన్యానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. (రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్) చైనా దొంగ దెబ్బ తీసింది.. ‘‘భారత భూ భాగాన్ని, సైనికుల ప్రాణాలను రక్షించడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. పరిణామాలను ఎదుర్కోవడానికి షరతులు లేకుండా వ్యవహరించాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని’’ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహించామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. జవాన్ల త్యాగాలు వృధాపోవని, ఏ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ లక్ష్య సాధన కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కల్పించామని తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందన్నారు. చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. (ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం) కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచదర్‌రావు,బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌రావు తదితరులు ఉన్నారు. అంతకు ముందు రోడ్లు,భవనాల శాఖ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
బలరాం కుటుంబాన్నికి జగన్ పరామర్శ
-
రైలు ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ పరామర్శ
-
చాంద్ బాషా కుటుంబానికి జగన్ పరామర్శ
-
అక్రమ కేసులకు భయపడం
అనంతపురం టౌన్ : ప్రత్యేక హోదా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్‌ఆర్‌ఎస్‌యూ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారని, ఇలాంటి వాటికి భయపడేది లేదని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలామ్‌బాబా స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్కేయూకు వచ్చిన ఆయన సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, వర్సిటీ నేత భానుప్రకాశ్‌రెడ్డి, పరిశోధక విద్యార్థి జయచంద్రారెడ్డితో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం, కేసులు నమోదును ఆయన ఖండించారు. సస్పెన్షన్లకు, అక్రమ కేసులకు భయపడేదని లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను వచ్చానని, నేతలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు కషి చేయాలని నాయకులకు సూచించారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, ఎస్కేయూ నాయకులు క్రాంతికిరణ్, వెంకటేశ్ యాదవ్, అమర్నాథ్, చార్లెస్, రాజారెడ్డి, సునీల్, నారాయణరెడ్డి, తిరుమలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ జేసీ పరామర్శ
అనంతపురం న్యూసిటీ : డెంగీతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం పరామర్శించారు. శనివారం వినాయకనగర్‌లోని పిల్లల తండ్రి ఖలందర్, వారి కుటుంబీకులతో జరిగిన తీరుపై చింతిస్తున్నామని జేసీ చెప్పారు. ఏవిధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21న సీఎం చంద్రబాబును కలసి పరిస్థితిని వివరిస్తానన్నారు. అనంత నగరాభివృద్ధి వేదిక వ్యవస్థాపకుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు కృష్ణం రఘు, కార్పొరేటర్ దుర్గేష్ పాల్గొన్నారు. నేనేమీ చేయలేనమ్మా.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. వినాయకనగర్ ప్రజలు కాలువలు శుభ్రం చేయడం లేదని ఎంపీకి చెప్పారు. అందుకు ఎంపీ ‘ నేనేమీ చేయలేనమ్మా. అంతా మున్సిపాలిటోళ్లు చూసుకోవాలి. మీరు అక్కడకు ధర్నా చేయండి’ అని హితవు పలికారు. ఆ సమాధానంతో వారు అవాక్కయ్యారు. -
ఉదయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
ఈటల రాజేందర్‌కు కేసిఆర్ పరామర్శ
-
ప్రమాద మృతులకు వైఎస్సార్సీపీ నివాళి
విశాఖపట్టణం: ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడి మృతి చెందిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. అంతకుముందు మృతదేహాలను శనివారం సాయంత్రం వ్యాన్లలో అచ్యుతాపురం మండలం మోసయ్య పేటకు తీసుకురాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
రోడ్డుప్రమాద బాధితులను పరామర్శించిన ఈటెల
కరీంనగర్ (గోదావరిఖని): గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. క్షతగాత్రులను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
ఖమ్మం టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్
పినపాక: ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. తుళ్లూరు బ్రహ్మయ్య తండ్రి పుల్లయ్య 10 రోజుల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శనివారం ఖమ్మం జిల్లా అశ్వాపురంలోని బ్రహ్మయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన అనంతరం లోకేశ్ తిరుగు ప్రయాణం అయ్యారు. -
'ప్రభుత్వం చెబుతున్నదేంటి చేస్తున్నదేంటి'
-
గోకులపాడు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
సత్యనారాయణకు వైఎస్ జగన్ పరామర్ష
-
బిల్డర్ నుంచి నష్ట పరిహారం రాబడతాం: జగన్
-
బిల్డర్ నుంచి నష్ట పరిహారం రాబడతాం: జగన్
చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు బిల్డర్ నుంచి నష్టపరిహారం రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫష్టం చేశారు. అందుకోసం తమ పార్టీ నుంచి ఓ బృందాన్ని చెన్నై పంపిస్తామని వెల్లడించారు. మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డర్‌ను కోరతామని ఆయన తెలిపారు. అందుకు బిల్డర్ ఒప్పుకోకుంటే కోర్టులో కేసు వేసి నష్టపరిహారం రాబతామన్నారు. చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురంలో మృతుల కుటుంబసభ్యులు పతివాడ బంగారునాయుడు, కర్రి తౌడమ్మ, సిరిపురపు రాము, పేకేటి అప్పలరామ్, లక్ష్మీ, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రి మీనమ్మను కూడా జగన్ పరామర్శించి... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
వడివేలు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
రెడ్డి గౌస్ కుటుంబానికి జగన్ పరామర్శ
-
అంజన్న కుంటుంబానికి జగన్ పరామర్శ