
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిళ, బ్రదర్ అనిల్ ఫోన్‌లో పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఇటీవల పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సత్యనారాయణమ్మ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. (ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం)
Comments
Please login to add a commentAdd a comment