ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు సీఎం ఫోన్‌కాల్‌ | CM YS Jagan Consoles MLA Meka Pratap Apparao | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు సీఎం ఫోన్‌కాల్‌

Published Sun, Sep 6 2020 8:31 PM | Last Updated on Sun, Sep 6 2020 8:34 PM

CM YS Jagan Consoles MLA Meka Pratap Apparao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు కరోనాతో హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఫోన్‌లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఫోన్‌ చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే దొరబాబుకు సీఎం జగన్‌ పరామర్శ)

మెరుగైన చికిత్సకు బెంగళూరుకు..
కాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా కరోనాతో కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆదివారం ఆయనను ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement