Meka pratap apparao
-
24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు
అక్కిరెడ్డిగూడెం (ముసునూరు)/నూజివీడు: ప్రమాదాలు, విపత్తుల వేళ తమ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ.. పరిహారం ప్రకటించిన 24 గంటలలోపే బాధిత కుటుంబాలకు అండగా నిలబడి ఆదుకుంటోందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన బొప్పూడి కిరణ్ కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుని భార్య బొప్పూడి సుధారాణికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా.. వారిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన ఉదరుపాటి కృష్ణయ్య. మృతుడి భార్యకు, కుటుంబ సభ్యులకు వివాదం ఉండటంతో ఎక్స్‌గ్రేషియాను భార్యకు ఇవ్వాలా, మృతుడి తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. బీహార్‌కు చెందిన నలుగురు మృతులకు సంబంధించిన లీగల్ హెయిర్ కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ బీహార్‌లోని నలంద జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపారు. అక్కడి నుంచి లీగల్ హెయిర్ వచ్చిన తరువాత వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి తెలిపారు. ఇదిలాఉండగా.. ఆరుగురి మృతికి కారణమైన పోరస్ కెమికల్స్ కంపెనీపై ముసునూరు పోలీస్ స్టేషన్లో ఐపీసీ 337, 338, 304 (జీజీ) సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదైంది. తాత్కాలికంగా మూసివేసిన పోరస్ కంపెనీ వద్ద పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీని డ్రగ్ కంట్రోల్ ఏడీ పాండురంగ వరప్రసాద్ సందర్శించి లైసెన్స్ ఉందా, లేదా అని తనిఖీ చేశారు. క్షతగాత్రులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను శుక్రవారం నూజివీడులో అందజేశారు. ప్రమాదంలో రమణక్కపేటకు చెందిన సాయిల నాగేశ్వరరావు, సూరేపల్లికి చెందిన షేక్ సుభాని, చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన కంచర్ల జోసెఫ్, నూజివీడు పట్టణానికి చెందిన చందోలు రాజీవ్ గాయపడగా.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, తహసీల్దార్ కేఎస్ జోజి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు సీఎం ఫోన్‌కాల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కరోనాతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఫోన్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఫోన్ చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే దొరబాబుకు సీఎం జగన్ పరామర్శ) మెరుగైన చికిత్సకు బెంగళూరుకు.. కాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా కరోనాతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆదివారం ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు తరలించారు. -
సంపూర్ణ ఆరోగ్యమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, కృష్ణాజిల్లా: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపునందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వి నియోగ పరుచుకోవాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో "వైఎస్సార్ కంటి వెలుగు" పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు బాలికలతో పాటు ఎమ్మెల్యే ప్రతాప్ సయితం వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకున్న బాలికలకు కార్డులు అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ నాయకుడి లక్ష్యం అన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఉపవైద్య అధికారి డి.ఆశా, వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలు తీరును వివరించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికే: ఎమ్మెల్యే అనిల్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన"వైఎస్సార్ కంటి వెలుగు" పథకం చాలా అద్బుతం అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా పామర్రు జడ్పీ హైస్కూల్లో "వైఎస్సార్ కంటివెలుగు" పథకాన్ని అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు వల్ల కంటి సమస్యలను గుర్తించి కళ్ళజోళ్ళను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్ది దశలోనే కంటి సమస్యలను గుర్తిస్తే వారి భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు.. మాటతప్పని మడమతిప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి అని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ఆటోవాలాల సంబరాలు అంబరాన్నంటాయి. కూచిపూడి ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక నాలుగురోడ్ల కూడలిలో ఆటోవాలాలు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను ఊరేగింపుగా తీసుకెళ్ళి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానసభలో ఎమ్మెల్యేను ఆటోవాలాలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 1.37 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతులయ్యారని.. దీన్ని కూడా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఏ ప్రభుత్వం చేయలేదని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆటో కార్మికుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు రూ.10 వేలు నగదు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోయూనియన్ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
జగన్‌కు ముసుగు రాజకీయాలు రావు
సాక్షి, నూజివీడు(కృష్ణా): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాదిరిగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముసుగు రాజకీయాలు రావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకోస వైఎస్ జగన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మధ్య చర్చలు జరిగాయన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. శనివారం నూజివీడు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు రావాలని భావిస్తున్నారని అన్నారు. ఈ పరిణామాలపై ప్రజలు సరైన తీర్పు ఇస్తారని నూజివీడు ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. -
నూజివీడు నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, నూజివీడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని నూజివీడు నియోజవర్గంలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. శోభనాపురం అడ్డరోడ్డు వద్ద నూజివీడు నియోజకవర్గంలోకి జననేత ప్రవేశించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఘనస్వాగతం పలికారు. రాజన్నబిడ్డను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా జిల్లా గణపవరం వద్ద బుధవారం పాదయాత్ర 1800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరారు. -
'చట్టాలను బాబు చుట్టాలుగా చేసుకుంటున్నారు'
కృష్ణా(నూజివీడు): దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టాలుగా చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. గురువారం కృష్ణా జిల్లా నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మట్టి దందా, ఇసుక దందా నడుస్తోందని.. సీఎం తన అనుయాయులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.