కృష్ణా(నూజివీడు): దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టాలుగా చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. గురువారం కృష్ణా జిల్లా నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని, వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను కూడా ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మట్టి దందా, ఇసుక దందా నడుస్తోందని.. సీఎం తన అనుయాయులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'చట్టాలను బాబు చుట్టాలుగా చేసుకుంటున్నారు'
Published Thu, Jul 16 2015 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement