
సాక్షి, నూజివీడు(కృష్ణా): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాదిరిగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ముసుగు రాజకీయాలు రావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకోస వైఎస్ జగన్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మధ్య చర్చలు జరిగాయన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. శనివారం నూజివీడు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు రావాలని భావిస్తున్నారని అన్నారు. ఈ పరిణామాలపై ప్రజలు సరైన తీర్పు ఇస్తారని నూజివీడు ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment