
అక్రమ కేసులకు భయపడం
అనంతపురం టౌన్ : ప్రత్యేక హోదా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్‌ఆర్‌ఎస్‌యూ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారని, ఇలాంటి వాటికి భయపడేది లేదని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలామ్‌బాబా స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్కేయూకు వచ్చిన ఆయన సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, వర్సిటీ నేత భానుప్రకాశ్‌రెడ్డి, పరిశోధక విద్యార్థి జయచంద్రారెడ్డితో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం, కేసులు నమోదును ఆయన ఖండించారు.
సస్పెన్షన్లకు, అక్రమ కేసులకు భయపడేదని లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను వచ్చానని, నేతలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు కషి చేయాలని నాయకులకు సూచించారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, ఎస్కేయూ నాయకులు క్రాంతికిరణ్, వెంకటేశ్ యాదవ్, అమర్‌నాథ్, చార్లెస్, రాజారెడ్డి, సునీల్, నారాయణరెడ్డి, తిరుమలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.