రోడ్డుప్రమాద బాధితులను పరామర్శించిన ఈటెల | minister eetela consoles the road accident persons | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాద బాధితులను పరామర్శించిన ఈటెల

Jun 6 2015 9:52 AM | Updated on Aug 30 2018 3:58 PM

గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు.

కరీంనగర్ (గోదావరిఖని): గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. క్షతగాత్రులను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement