minister eetela rajender
-
ఈటల మొసలికన్నీళ్లకు ఆగం కావద్దు
హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తుంటే వాటిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దండగ అంటున్నారని.. ఆత్మగౌరవం అంటూ తన పదవికి రాజీనామా చేసిన రాజేందర్ మొసలికన్నీళ్లకు, తియ్యటి మాటలకు హుజూరాబాద్ ప్రజలు ఆగం కావద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గడియారాలకు, కుంకుమ భరిణెలకు లొంగవద్దని, న్యాయాన్ని, ధర్మాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. గురువారం హుజూరాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మహిళలను మరింత బలోపేతం చేసేందుకే ఈ రుణాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మహిళలకు ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పదహారు గ్రామాల్లో రూ.3.10 కోట్లతో అన్ని వసతులతో మహిళా భవననాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి, ఆ మహిళలకు రూ.2,016 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే పెన్షన్ అందజేస్తామని చెప్పారు. 4 వేల డబుల్ ఇళ్లు పూర్తి చేస్తా.. హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ 4 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఈటల రాజేందర్ పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ ఇళ్లు కట్టించే బాధ్యత తనదని, ఇళ్లు వెంటనే పూర్తి చేయిస్తామని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శాలపల్లి గ్రామంలో సభ ఏర్పాట్లను మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని.. 5 బ్లాకులు మహిళలకు, 5 బ్లాకులను ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కేటాయించాలన్నారు. వీఐపీలకు, ప్రెస్‌కు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. -
మంత్రి ఈటలను ఘెరావ్ చేసిన నిరుద్యోగులు
సాక్షి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్‌కు సొంత జిల్లా కరీంనగర్లో నిరుద్యోగుల సెగ తగలింది. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఈటల శుక్రవారం వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు, నిరుద్యోగులు అడ్డుకుని ఘొరావ్ చేశారు. కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేకుంటే నిరుద్యోగులకు భృతి అయినా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఏబీవీపీ కార్యకర్త సృహతప్పి పడిపోయాడు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ( చదవండి: ప్రతి ఖాళీని భర్తీ చేయాలి ) -
ఆటో డ్రైవర్ల ధూంధాం
-
చెరువులపై అజమాయిషీ కమిటీలు
వాటిలో మత్స్యకారులు, రజకులకు చోటు: ఈటల సాక్షి, హైదరాబాద్: చెరువులపై అజమాయిషీ కమిటీలు వేస్తామని, వాటిలో మత్స్యకారులు, రజకులతో పాటు గ్రామసర్పంచ్‌లకు స్థానం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎఫ్టీఎల్ లోపు ఉండే ప్రైవేట్‌భూములను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. చెరువుల్లో ఒక పక్కగా గుంతలు తవ్వుకుంటే తమ శాఖ సహకారం అందిస్తుందని, వీటిలో చేపలు పెంచుకోవచ్చునన్నారు. శనివారమిక్కడ ఎంసీఆర్హెచ్ఆర్డీలో మత్స్యశాఖ నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో ఈటలతోపాటు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో మత్స్యకారుల పాత్ర ముఖ్యమైందని, మత్స్యకారులు ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలని ఈటల సూచించారు. సాగునీటి శాఖలో ఎదురవుతున్న ఇబ్బందులపై మత్స్యకారు లు ఫిర్యాదు చేయగా, తాళ్లు ఎక్కేవారికే తాటి చెట్టు, చేపలు పట్టే వారివే చెరువులని ఈటల అన్నారు. పోచారం మా ట్లాడుతూ, చేపల విత్తనాలు ఉచి తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు వెచ్చిస్తుంద ని, అందులో సగం బతికినా మత్స్యకారులకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుం దని చెప్పారు. రాష్ట్రంలో పాడైన 28 చేపల చెరువులను పునరుద్ధరిస్తామని, వీలైన చోట్ల కొత్తవి నిర్మిస్తామన్నారు. ఇందుకోసం ఆర్థికశాఖ రూ.11కోట్ల బడ్జెట్ మంజూరు చేసిం దని చెప్పారు. జిల్లాల అవసరాలకు తగ్గట్లుగా ఆ ప్రాంతంలోనే విత్తనాలను తయారుచేయాలని, అందుకు కార్యాచరణ తయారుచేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరి ధిలో 250 కొత్త మార్కెట్‌యార్డుల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఇందులోనే చేపల మార్కెట్లకూ స్థలం ఉంటుందన్నారు. కేజ్ కల్చర్‌ను ఆరు రిజర్వాయర్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, ఇది విజయవంతమైతే మత్స్యకారుల దశ తిరుగుతుందన్నారు. ఇందుకు 80శాతం సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మ త్స్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, కమిషనర్ సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సబ్సిడీపై కందిపప్పు
♦ త్వరలో ఉల్లి తరహాలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: ఈటల ♦ రూ.135కు కిలో చొప్పున కేంద్రం నుంచి కొనుగోలుకు సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: కందిపప్పును కిలోకు రూ.135 చొప్పున సరఫరా చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలపై విక్ర యిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాల తరహాలో మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కేంద్రాలు చేర్పాటు చేస్తామని చెప్పారు. సోమవారం కందిపప్పు ధరల నియంత్రణ, ధాన్యం కొనుగోలు, సన్నబియ్యం అక్రమాల నివారణ తదితర అంశాలపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డీఎస్వో, డీఎంసీలతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘కందిపప్పును ఇంతకుముందు కేంద్రం నుంచి కిలో రూ.125కి కొనుగోలు చేసి రేషన్‌పై పేదలకు రూ.50కే అందించడం జరిగింది. ప్రస్తుతం ధర రూ.200కు చేరినా రూ.50కే అందిస్తున్నాం. కేంద్రం కందిపప్పును కిలో రూ.135కే సరఫరా చేస్తే ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున అందిస్తాం..’’ అని ఈటల చెప్పారు. కందిపప్పు దళారులు, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా విసృ్తతంగా దాడులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదని మంత్రి చెప్పారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ నేతృత్వంలో కమిటీని నియమిస్తామని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాఖలో ఇంటిదొంగలుగా మారిన కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నామని, మెదక్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులపై త్వరలోనే వేటు వేయనున్నామని తెలిపారు. కనీస మద్దతు ధరే కష్టం! రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు విసృ్తత ఏర్పాట్లు చేశామని, ఎన్ని అవసరమైతే అన్ని కేంద్రాలు తెరవాలని అధికారులకు సూచించామని ఈటల చెప్పారు. రైతులను ఆదుకునేందుకు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించగా... ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కనీస మద్దతు ధరను ఇప్పించడమే కష్టంగా ఉంది. పత్తికి కనీస మద్దతు ధర రూ.4వేలకు పైగా నిర్ణయించినా ఎక్కడా రూ.3,500కు మించి రావడం లేదు. ఈ పరిస్థితిని నియంత్రించి కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కనీస మద్దతు ధర సరిపోతుందని మేం భావించడం లేదు. ఆ ధర కూడా రాకుండా అడ్డుకుంటున్న బ్రోకర్ల నుంచి రైతులను కాపాడుతున్నాం..’’ అని మంత్రి పేర్కొన్నారు. -
కరీంనగర్ బాలికకు గిన్నిస్‌లో స్థానం
చాక్పీస్లపై విగ్రహాలు చెక్కడం ద్వారా రికార్డు కరీంనగర్ : 8 సెంటీమీటర్ల చాక్‌పీస్‌పై 60 సెకన్లలో 12 వినాయక విగ్రహాలు చెక్కడం ద్వారా కరీంనగర్‌కు చెందిన మాద్విక (14) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధిం చింది. కరీంనగర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ పీక శశిధర్ కుమార్తె మాద్విక గతేడాది నవంబర్ 24న తన ప్రతిభను ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. మాద్విక గతంలోనూ పలు రికార్డులు సాధించింది. ఈ చిన్నారి మాజీ డీజీపీ ప్రసాదరావు నుంచి నగదు పురస్కారాన్ని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా లిటిల్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంది. -
రోడ్డుప్రమాద బాధితులను పరామర్శించిన ఈటెల
కరీంనగర్ (గోదావరిఖని): గోదావరిఖనిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. క్షతగాత్రులను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.