చెరువులపై అజమాయిషీ కమిటీలు | The pond on the Supervision Committees | Sakshi
Sakshi News home page

చెరువులపై అజమాయిషీ కమిటీలు

Published Sun, Nov 22 2015 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

The pond on the Supervision Committees

వాటిలో మత్స్యకారులు, రజకులకు చోటు: ఈటల
 
 సాక్షి, హైదరాబాద్: చెరువులపై అజమాయిషీ కమిటీలు వేస్తామని, వాటిలో మత్స్యకారులు, రజకులతో పాటు గ్రామసర్పంచ్‌లకు స్థానం కల్పిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎఫ్‌టీఎల్ లోపు ఉండే ప్రైవేట్‌భూములను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. చెరువుల్లో ఒక పక్కగా గుంతలు తవ్వుకుంటే తమ శాఖ సహకారం అందిస్తుందని, వీటిలో చేపలు పెంచుకోవచ్చునన్నారు. శనివారమిక్కడ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మత్స్యశాఖ నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో ఈటలతోపాటు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

స్థూల జాతీయోత్పత్తిలో మత్స్యకారుల పాత్ర ముఖ్యమైందని, మత్స్యకారులు ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలని ఈటల సూచించారు. సాగునీటి శాఖలో ఎదురవుతున్న ఇబ్బందులపై మత్స్యకారు లు ఫిర్యాదు చేయగా, తాళ్లు ఎక్కేవారికే తాటి చెట్టు, చేపలు పట్టే వారివే చెరువులని ఈటల అన్నారు. పోచారం మా ట్లాడుతూ, చేపల విత్తనాలు ఉచి తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు వెచ్చిస్తుంద ని, అందులో సగం బతికినా మత్స్యకారులకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుం దని చెప్పారు. రాష్ట్రంలో పాడైన 28 చేపల చెరువులను పునరుద్ధరిస్తామని, వీలైన చోట్ల కొత్తవి నిర్మిస్తామన్నారు.

ఇందుకోసం ఆర్థికశాఖ రూ.11కోట్ల బడ్జెట్ మంజూరు చేసిం దని చెప్పారు. జిల్లాల అవసరాలకు తగ్గట్లుగా ఆ ప్రాంతంలోనే విత్తనాలను తయారుచేయాలని, అందుకు కార్యాచరణ తయారుచేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరి ధిలో 250 కొత్త మార్కెట్‌యార్డుల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఇందులోనే చేపల మార్కెట్లకూ స్థలం ఉంటుందన్నారు. కేజ్ కల్చర్‌ను ఆరు రిజర్వాయర్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, ఇది విజయవంతమైతే మత్స్యకారుల దశ తిరుగుతుందన్నారు. ఇందుకు 80శాతం సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. మ త్స్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, కమిషనర్ సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement