ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లతో పాటు ఆర్డీవోల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐదుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో పాటు 29 మంది ఆర్డీవోలకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.హరిసింగ్‌కు వరంగల్ రూరల్ డీఆర్డీవోగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న పి.చంద్రయ్యకు వనపర్తి డీఆర్డీవోగా, జీఏడీలో ఉన్న కె.చంద్రమోహన్‌కు బ్రాహ్మణ పరిషత్ అడ్మినిస్ట్రేటర్‌గా, డి.వేణుగోపాల్‌కు జోగులాంబ గద్వాల జిల్లా డీఆర్డీవోగా, డి.మధుసూదన్ నాయక్‌కు నాగర్‌కర్నూల్ డీఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ ఆర్డీవోగా కె.చంద్రకళ, హైదరాబాద్ కలెక్టరేట్‌లో భూపరిరక్షణ అధికారిగా రాధికా రమణి, జహీరాబాద్ ఆర్డీవోగా అబ్దుల్ హమీద్, నారాయణఖేడ్ ఆర్డీవోగా టి.శ్రీనివాసరావు, మెదక్ జిల్లా పరిషత్ సీఈవోగా టి.రవి, పెద్దపల్లి డీఆర్డీవోగా సి.సూర్యనారాయణ, నిజమాబాద్ ఆర్డీవోగా టి.వినోద్ కుమార్, మంథని ఆర్డీవోగా బి.పద్మయ్య, నిజామాబాద్ జిల్లా పరిషత్ సీఈవోగా జె.రాజేశ్వర్, నిజామాబాద్ ఎస్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈడీగా ఎల్.రమేశ్, కరీంనగర్ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, హుజురాబాద్ ఆర్డీవోగా బోయపాటి చెన్నయ్య, కాగజ్‌నగర్ ఆర్డీవోగా ఎస్.రమేశ్‌బాబు, ఆసిఫాబాద్ ఆర్డీవోగా కడం సురేశ్, నర్సంపేట ఆర్డీవోగా ఎన్.రవి, బాన్సువాడ ఆర్డీవోగా ఎస్.రాజేశ్వర్, కామారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, గద్వాల్ ఆర్డీవోగా సీహెచ్.రవీందర్‌రెడ్డి, వనపర్తి ఆర్డీవోగా కె.చంద్రారెడ్డి, వికారాబాద్ ఆర్డీవోగా ఎస్.విశ్వనాథం, సిరిసిల్ల ఆర్డీవోగా ఎన్.పాండురంగ, జగిత్యాల ఆర్డీవోగా జి.నరేందర్‌కు పోస్టింగ్‌లు ఇచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా డీఆర్డీవోగా కె.అనంతరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీవోగా రమాదేవి, టీఎస్‌ఐఐసీ ఎస్డీసీగా జి.శివకుమార్, అచ్చంపేట ఆర్డీవోగా సి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా ప్రసూనాంబ, నాగర్‌కర్నూల్ ఆర్డీవోగా సీహెచ్.శ్రీనివాసులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పాలనాధికారిగా ఎల్.రమాదేవికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
34 మంది ఎస్‌డీసీలు, ఆర్డీవోల బదిలీ
Published Thu, Mar 2 2017 4:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
Advertisement
Advertisement