స్కిల్ హబ్‌ను ప్రారంభిస్తున్న సజ్జల
కడప కార్పొరేషన్: యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలోని ప్రభుత్వ ఐటీ కళాశాలల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు(స్కిల్ డెవలప్‌మెంట్, శిక్షణ) చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా సీఎం జగన్ రెండు స్కిల్ వర్సిటీలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సజ్జల
సిద్దవటం: అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలోని నేకనాపురానికి సమీపంలో డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ తక్కోలి మాచిరెడ్డి దంపతులు నిర్మించిన జీవని వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆశ్రమానికి తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment