employment generation
-
అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ‘ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ శనివారం తెలిపారు. 2010–20 మధ్య భారత్ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్ బేస్‌ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. -
Union Budget 2024-25: నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం
నిరుద్యోగ సమస్యకు ముకుతాడు వేసేందుకు బడ్జెట్లో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిం చడంపై దృష్టి పెట్టింది. వారికి అదనపు ఉపాధి కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు ప్రకటించారు. నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్ల పాటు యజమాని వాటా పీఎఫ్ చందాను రీయింబర్స్ చేయనున్నారు. పని ప్రాంతంలోనే ఉండేందుకు వీలుగా చిరుద్యోగులకు డారి్మటరీల ఏర్పాటునూ ప్రతిపాదించారు. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేవారికి తొలి వేతనాన్ని ప్రభుత్వమే ఇస్తుందని విత్త మంత్రి ప్రకటించారు. వీటన్నింటికి వచ్చే ఐదేళ్లలో ఏకంగా రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నారు. తద్వారా 4 కోట్ల మంది పై చిలుకు యువతకు ప్రయోజనం చేకూర్చడం, ఆ మేరకు వ్యవసాయ రంగంపై భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దేశీయంగా ఉన్నత విద్యకూ రుణ భరోసా ఇచ్చారు. వేతన జీవులకు నామమాత్రపు ఆదాయ పన్ను ఊరట కల్పిం చారు. దాన్ని కూడా కొత్త పన్ను విధానానికే పరిమితం చేశారు. అదే సమయంలో మోదీ సర్కారు ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు! మోదీ సర్కారు మనుగడకు కీలకమైన నితీశ్ సారథ్యంలోని బిహార్‌కు రూ.60 వేల కోట్ల మేరకు వరాలు గుప్పించగా ఏపీకి రూ.15 వేల కోట్ల ‘ప్రపంచ బ్యాంకు’ రుణంతో సరిపెట్టారు... ఇవి ప్రియం ∗ అమ్మోనియం నైట్రేట్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు/పీవీసీ ఫ్లెక్స్ షీట్లు ∗ గార్డెన్లో వినియోగించే గొడుగులు ∗ సోలార్స్ గ్లాస్ ∗ దిగుమతి చేసుకునే టెలికం పరికరాలు∗ ల్యాబొరేటరీ కెమికల్స్, బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఇవి చౌక ∗ బంగారం, వెండి, ప్లాటినం,పల్లాడియం, ఓస్మియం, రుతీనియం, ఇరీడియం కాయిన్లు, కాపర్. ∗ క్వార్ట్జ్, లిథియం కార్బోనేట్, లిథియం ఆక్సైడ్, లిథియం హైడ్రాక్సైడ్, నైట్రేట్స్ పొటాíÙయం, ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్ ∗ కేన్సర్ ఔషధాలు (ట్రస్టుజుమాబ్ డెరుక్స్‌టెకాన్, ఓసిమెరి్టనిబ్, డుర్వాలుమాబ్) ∗మెడికల్ ఎక్స్‌రే మెషీన్లలో వినియోగించే ట్యూబ్‌లు,ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్లు ∗ మొబైల్ ఫోన్లు, చార్జర్లు,మొబైల్ ఫోన్ ప్రింటెడ్సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ) ∗ సోలార్ సెల్స్, ప్యానెల్స్ ఎక్విప్మెంట్ ∗ చేపలు, రొయ్యల మేత ∗ తోలు ఉత్పత్తులు, పాదరక్షలు ∗ టెక్స్టైల్స్ 2024–25 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా మూడోసారి నమ్మకముంచిన దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ రూపుదిద్దుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ నానా సవాళ్లతో సతమతం అవుతున్నా భారత్ మాత్రం తిరుగులేని వృద్ధిరేటుతో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. ‘‘ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్టు మన దేశంలో ఉన్నది ‘నాలుగే కులాలు’. అవి... పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు. వారి అభ్యున్నతి కోసం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, మధ్యతరగతిపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాం’’ అని వివరించారు. 4.1 కోట్ల పై చిలుకు యువతీయువకులకు వచ్చే ఐదేళ్లలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన నిమిత్తం 5 పథకాలతో కూడిన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ని ప్రకటించారు. 2047 నాటికి వికసిత భారత్ సాకారమే లక్ష్యంగా ‘వ్యవసాయ రంగంలో మరింత ఉత్పాదకత, ఉపాధి–నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం, నిర్మాణ–సేవా రంగాలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్–రీసెర్చ్, సంస్కరణ’ల పేరిట ఎన్డీఏ ప్రభుత్వ ‘తొమ్మిది ప్రాథమ్యాల’కు తెరతీశారు. దీన్ని రానున్న బడ్జెట్లలో మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. రైతు నుంచి యువత దాకా... వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్లో పలు చర్యలు చేపట్టినట్టు నిర్మల వెల్లడించారు. ‘‘సాగులో ఉత్పాదకతను పెంచేలా పరిశోధనలకు పెద్దపీట వేయనున్నాం. 32 పంట రకాల్లో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 100కు పైగా వంగడాలను అభవృద్ధి చేస్తాం. కోటిమందికి పైగా రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లిస్తాం. అందుకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తాం. తృణధాన్యాలు, నూనెగింజల అభివృద్ధిలో వీలైనంత త్వరగా స్వయంసమృద్ధి సాధిస్తాం’’ అని వివరించారు. ‘‘సంఘటిత రంగంలో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టే వారికి తొలి నెల వేతనం కేంద్రమే అందిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పిస్తాం. కోటి మందికి టాప్–500 కంపెనీల్లో ఇంటర్న్íÙప్ అవకాశం కల్పిస్తాం. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలకు వీలు కల్పిస్తాం. అన్ని రంగాల్లోనూ మహిళలు మరింతగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తాం’’ అని చెప్పారు. ఉద్యోగికీ, యజమానికీ ఇద్దరికీ లాభించేలా పీఎఫ్ ప్రోత్సాహకాల వంటి పలు చర్యలను ప్రకటించారు. అధికారికంగానే 6.7 శాతం దాటిన పట్టణ నిరుద్యోగాన్ని ఎంతో కొంత నేలకు దించే ప్రయత్నం బడ్జెట్ కేటాయింపుల్లో కనిపించింది. భాగస్వాములకు ఇలా... ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కోణంలో చూస్తే నితీశ్‌కుమార్ పాలనలోని బిహార్‌పై నిర్మలమ్మ ఏకంగా రూ.60,000 కోట్ల మేరకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ వేలు, భారీ విద్యుత్కేంద్రం, రెండు హెరిటేజ్ కారిడార్లు, ఎయిర్‌పోర్టుల వంటివెన్నో వీటిలో ఉన్నాయి. ఇవేగాక అవసరమైన మేరకు ఆ రాష్ట్రానికి మరిన్ని అదనపు కేటాయింపులూ ఉంటాయని మంత్రి ప్రకటించారు! అక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న విషయం తెలిసిందే. రాజధాని అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక రుణం అందేలా చూస్తామన్నారు. పోలవరం త్వరిత నిర్మాణం, రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు గ్రాంటు తదితరాలను ప్రస్తావించారు. రాష్ట్రాలతో కలిసి ముందుకు... నగరాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమన్వయంతో కృషి చేస్తామని నిర్మల పేర్కొన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి ద్వారా వాటిని గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు కట్టించనున్నారు. మహిళలు, బాలికల ప్రగతి, సంక్షేమానికి ఈసారి ఏకంగా రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. ‘‘పీఎం సూర్య ఘర్ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు అందించే పథకానికి అద్భుతమైన స్పందన వచి్చంది. 14 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని మంత్రి చెప్పారు. ఈ పథకాన్ని మరింతగా ముందుకుతీసుకెళ్తామన్నారు. మహిళలకు మంచి కబురు సామాన్యునిపై పన్నుల భారాన్ని వీలైంతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. మహిళలకు చల్లని కబురు వినిపించారు. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు మొబైల్స్‌పైనా దిగుమతి సుంకం తగ్గించారు. తద్వారా వాటి ధరలు దిగి రానున్నాయి. పీఎం విశ్వకర్మ, స్వానిధి, స్టాండప్ ఇండియా తదితరాలతో చేతి వృత్తుల వారు, స్వయంసహాయక బృందాలు మొదలుకుని ఎస్సీ, ఎస్టీల దాకా అన్ని వర్గాల సంక్షేమానికి భరోసా లభిస్తుందని మంత్రి అన్నారు. ‘పూర్వోదయ’ పథకం తూర్పు భారతదేశ ప్రగతిని పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకూ పలు కేటాయింపులు చేశారు. పర్యాటకాభివృద్ధికి పలు చర్యలను ప్రతిపాదించారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వారా స్టార్టప్‌లకు మరింత ఊపునిచ్చేందుకు విత్త మంత్రి ప్రయతి్నంచారు. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని 40 నుంచి 35 శాతానికి తగ్గించారు. అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిశోధనల కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టణ భూ రికార్డులను పూర్తిగా డిజిటైజ్ చేయనున్నట్టు తెలిపారు. ఆదాయపన్ను చట్టం–1961ని సమూలంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాథమ్యాలు1. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ∗ వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపులు ∗ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 రకాల కొత్త వంగడాలు రైతులకు అందుబాటులోకి ∗ రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టేలా చర్యలు. ∗ అందుకు దన్నుగా నిలిచేలా 10 వేల బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలు ∗ రైతులు, వారి భూముల కవరేజీ తదితరాల కోసం మూడేళ్లలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా (డీపీఐ) అభివృద్ధి 2.ఉపాధి–నైపుణ్యాభివృద్ధి ∗ ఏ పథకాల్లోనూ లబి్ధదారులు కాని యువతకు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలు ∗ ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ∗ ఉద్యోగికి, యజమానికి లాభించేలా పీఎఫ్ ప్రోత్సాహకాలు తదితరాలు ∗ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు ∗ ఐదు పథకాలతో కూడిన సమగ్ర ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ 3. మానవ వనరుల అభివృద్ధి– సామాజిక న్యాయం ∗ పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక, హెరిటేజ్ కారిడార్ల అభివృద్ధి ∗ 63 వేల గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకం ∗ మహిళలు, బాలికల అభ్యున్నతి పథకాలకు రూ.3 లక్షల కోట్లు ∗ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 4. నిర్మాణ–సేవా రంగాలు∗ తయారీ రంగంలో ఎంఎస్ఎంఈల కోసం రుణ హామీ పథకాలు ∗ థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.100 కోట్ల దాకా రుణాలు ∗ముద్రా రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు ∗ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కామర్స్ ఎగుమతి హబ్‌లు 5. పట్టణాభివృద్ధి∗ 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్రాభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు, వ్యూహాలు ∗ ప్రధాని పట్టణ ఆవాస్ యోజన 2.0 కింద కోటి మంది పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్లు ∗ ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో ఏటా 100 చొప్పున వీధి మార్కెట్లు 6. ఇంధన భద్రత∗ ఉపాధి, వృద్ధి తదితరాలతో పాటు పర్యావరణ హితాన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహం ∗ కరెంటు నిల్వ కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ∗ ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో చిన్న, మాడ్యులార్ అణు రియాక్టర్ల అభివృద్ధి 7. మౌలిక సదుపాయాలు ∗ దీర్ఘకాలిక లక్ష్యంతో రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపులు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలకు రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు ∗ పీఎంజీఎస్‌వై–4తో 25 వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ ∗వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నివారణే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు ∗ పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి 8. ఇన్నొవేషన్ – రీసెర్చ్ ∗ పరిశోధన, నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ∗ ప్రైవేట్ రంగ సమన్వయంతో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సా హమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఫైనాన్సింగ్ పూల్ ∗ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే పదేళ్లలో కనీసం ఐదు రెట్లు విస్తరణ.అందుకు ఈ బడ్జెట్లో రూ.1,000 కోట్లు. 9. భావి తరం సంస్కరణలు∗ భూములన్నింటికీ ప్రత్యేక ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేదా భూ ఆధార్ ∗ భూ రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీతో లింకేజీ ∗ జీఎస్ఐ మ్యాపింగ్‌తో పట్టణ ప్రాంత భూ రికార్డుల డిజిటైజేషన్ ∗అన్నిరకాల కార్మిక సేవలూ ఒక్కతాటిపైకి. సంబంధిత పోర్టళ్లతో ఇ–శ్రామ్ పోర్టల్ అనుసంధానంభూటాన్కు అత్యధికం.. మాల్దీవులకు కోతన్యూఢిల్లీ: భారత పొరుగుదేశమైన భూటాన్‌కు ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా రూ.2068 కోట్లను అభివృద్ధి ఎయిడ్ కింద కేటాయించింది. అయితే, మాల్దీవులకు మాత్రం గత ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించింది. మాల్దీవులకు గత ఏడాది రూ.770 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది. గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూలురైన మొహమ్మద్ మొయిజ్జు వచ్చాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. విదేశాంగ శాఖకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.29,121 కోట్లు కేటాయించగా 2024–25 బడ్జెట్లో రూ.22,154 కోట్లు కేటాయించారు. భూటాన్ తర్వాత నేపాల్‌కు అధికంగా నిధులు (రూ.700 కోట్లు) కేటాయించారు. శ్రీలంకకు గత ఏడాది రూ.60 కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర బడ్జెట్లో సాయం కింద అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, మారిషస్‌కు రూ.370 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ.200 కోట్లు కేటాయించారు. లాటిన్ అమెరికా, యురేసియా దేశాలకు అభివృద్ధి సాయం కింద రూ. 4883 కోట్లు కేటాయించారు. -
అక్టోబర్‌లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్‌వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
వృద్ధిలో రత్నాలు–ఆభరణాల రంగం కీలకం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనలో రత్నాలు, ఆభరణాల రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రత్నాలు, ఆభరణాల ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రత్నాలు– ఆభరణాల రంగం ప్రభుత్వానికి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తుంది. ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుంది’’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి పేర్కొన్నారు. భారత్ ఆభరణాల తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్లలో సమస్యలను ఎదుర్కొంటున్నారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే తమ ఆభరణాల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా తయారీదారులు, వ్యాపారులు ప్రపంచ వజ్రాభరణాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించగలరన్న విశ్వాసాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. 15–22 తేదీల్లో షాపింగ్ ఫెస్టివల్ కాగా, ఆభరణాల తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఎగుమతిదారుల అత్యున్నత స్థాయి మండలి– జీజేసీ అక్టోబర్ 15 నుంచి 22వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 300 నగరాల్లో జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. -
రైతులకు చేయూత.. మహిళలకు ఉపాధి
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటాలతో పాటు కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. పొదుపు సంఘాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుచేయనుంది. వీటికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొ చ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)తో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఎపీఎఫ్‌పీఎస్) నేడు (సోమవారం) అవగాహనా ఒప్పందం చేసుకోబోతుంది. తొలిసారి కర్నూలు జిల్లాలో ఏర్పాటు.. ఉల్లి, టమాటా రైతుల వెతలు తీర్చేందుకు ఏపీఎఫ్‌పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారి కర్నూలు జిల్లాలో రూ.కోటి అంచనాతో 100 సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటుచేశారు. రూ.లక్ష అంచనా వ్యయంతో కూడిన ఈ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 35% సబ్సిడీతో వీటిని మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ ఆరు టన్నుల చొప్పున ఏటా 7.200 వేల టన్నుల ఉల్లి, టమాటాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కల్గిన ఈ యూనిట్ల 100 మందికి ఉపాధి లభిస్తుండగా, ఆయా ప్రాంతాలకు చెందిన 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరుతోంది. వీటిని ఇటీవలే సీఎం జగన్ ప్రారంభించారు. ఇంట్లోనే ఏర్పాటుచేసుకునే ఈ యూనిట్ల ద్వారా ప్రతీనెలా రూ.12వేల నుంచి రూ.18వేల వరకు అదనపు ఆదాయాన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల యూనిట్లు మంజూరుచేయాలని సంకల్పించింది. బీఓబీ ఆర్థిక చేయూత.. మరోవైపు.. ఈ సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల విస్తరణ పథకానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొ చ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీపై వీటిని మంజూరు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో రూ.లక్ష అంచనాతో ఒక్కో యూనిట్ ఏర్పాటుచేయగా, ఇక నుంచి రూ.2లక్షల అంచనా వ్యయంతో రెట్టింపు సామర్థ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు వె చ్చిస్తున్నారు. ఈ మొత్తంలో రూ.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చుచేయనుండగా, లబ్దిదారులు తమ వాటాగా రూ.10కోట్లు భరించాల్సి ఉంటుంది. రూ.65 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక చేయూతనిస్తోంది. ఇక బీఓబీ–ఏపీఎఫ్‌పీఎస్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు నేడు అవగాహనా ఒప్పందం చేసుకోబోతున్నాయి. -
భారత్‌లో ఉపాధి కల్పనపై దృష్టి
న్యూఢిల్లీ: భారత్‌లో ఉపాధి కల్పనతోపాటు, పర్యావరణ అనుకూల వృద్ధికి ప్రోత్సాహం, సామాజిక, ఆర్థిక సమగ్ర వృద్ధికి మద్దతు ఇవ్వనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రకటించింది. 2023–27 కాలానికి తన ప్రణాళికలను సంస్థ ప్రకటించింది. భారత్ కోసం నూతన భాగస్వామ్య విధానాన్ని ప్రారంభించింది. భారత్‌తో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో సమ్మిళిత, బలమైన సమగ్రాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి భారత్ త్వరగా పుంజుకుందని తెలిపింది. 2023–24 సంవత్సరానికి భారత్ 6.4 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, మానవాభివృద్ధి, ఆదాయం, ప్రాంతీయ అసమానతలు, వాతావరణం పరంగా సున్నితత్వం, ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడే సుస్థిర, సమగ్రాభివృద్ధి భారత్‌కు అవసరమని అభిప్రాయపడింది. పారిశ్రామిక కారిడార్లు, మల్టిమోడల్ లాజిస్టిక్స్, పట్టణ మౌలిక వసతులు, నైపుణ్యాల అభివృద్ధి, చిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలవనున్నట్టు ఏడీబీ తెలిపింది. దీనివల్ల పట్టణ ప్రాంతాలు మరింతగా వృద్ధి చెందుతాయని, పారిశ్రామిక పోటీతత్వం పెరుగుతుందని, సంఘటిత తయారీ రంగం, సేవల రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. ‘‘ఏడీబీ ఒకే సారి విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు మద్దతునిస్తుంది. మెరుగైన పట్టణ జీవనం, గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇస్తూ లింగ సమానత్వం, పర్యావరణ సుస్థిరతతకు ప్రోత్సాహాన్నిస్తుంది’’అని ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి తెలిపారు. భారత వాతావరణ ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం తమ నూతన అజెండాలో భాగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాల ద్వారా ఈ లక్ష్యాలను చేరుకుంటామన్నారు. ఏడీబీలో భారత్ నాలుగో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2022 డిసెంబర్ చివరికి 605 ప్రభుత్వరంగ రుణాలకు సంబంధించి 52.6 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే 8 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులనూ అందించనుంది. -
Vijaya Gupta K: విశ్రాంత జీవితమూ విలువైనదే!
ఆమె రోజుకు ఆరు గంటలు పని చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? నిజమే. ఆమె వయసు డెబ్బయ్. ఇదీ ఆమె ప్రత్యేకత. తన కోసమే కాదు... సమాజానికీ పనిచేస్తారు. ‘సృజనాత్మకత మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇష్టమైన పని దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ విలువైనదే... సద్వినియోగం చేసుకోవాలి’ అంటూన్న విజయాగుప్తా పరిచయం. ఇది స్క్రీన్ ఎరా. టీవీ స్క్రీన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్. ఇరవై నాలుగ్గంటల్లో పద్నాలుగు గంటలు స్క్రీన్‌తోనే గడిపేస్తున్నారు. స్క్రీన్ మీద పని చేయాల్సిన ఉద్యోగులకు తప్పదు. మరి ఖాళీగా ఉంటూ సమయం ఎలా గడపాలో తెలియక స్క్రీన్‌కి అంకితమయ్యే వాళ్లు మాత్రం తప్పనిసరిగా తమ ఇరవై నాలుగ్గంటలనూ ఒకసారి విశ్లేషించుకోవాలని చెబుతున్నారు హైదరాబాద్, హిమాయత్ నగర్‌కు చెందిన విజయాగుప్తా కోట్రికె. తనకిష్టమైన వ్యాపకం కోసం ఇంట్లో ఒక గదిని వర్క్ స్టేషన్‌గా మార్చుకున్నారామె. ఎనిమిదేళ్ల వయసులో గ్రీటింగ్ కార్డు తయారు చేసిన సృజనాత్మకమైన ఆమె విజయ ప్రస్థానం ఇది. జీవితం ఇచ్చిన గిఫ్ట్ ‘‘మా నాన్న ఉద్యోగ రీత్యా నేను పుట్టినప్పుడు చెన్నైలో ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌కి బదిలీ. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలతో మొత్తం ఏడుగురం. ఇంట్లో ఎవరూ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదు. పెళ్లి పత్రికల వెనుక ఖాళీ పేజీ మీద బొమ్మలు గీసి, పత్రిక మీద ఉండే కొన్ని బొమ్మలను కత్తిరించి అతికించి సొంతంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశాను. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో విరామం వచ్చింది. పిల్లలు పెద్దయ్యి, నాక్కొంత విరామం వచ్చేటప్పటికి యాభై ఏళ్లు నిండాయి. అప్పుడు అనుకోకుండా ఒక వరలక్ష్మీవ్రతంలో వాళ్లిచ్చిన రిటర్న్ గిప్టులు చూసినప్పుడు నాలోని సృజనాత్మక కోణం నిద్రలేచింది. ఆ సందర్భం... జీవితం నాకిచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు రెండు వందలకు పైగా క్రియేటివ్ పీస్‌లను తయారు చేస్తున్నాను. నాకు ఎగ్జిబిషన్లకు వెళ్లడం అలవాటు. కొన్నా కొనకపోయినా సరే... ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. ఏ ప్రాంతం ఏ హస్తకళలకు ప్రసిద్ధి అనేది అవగతమైంది. అలా ఉదయ్పూర్కెళ్లి అక్కడి కళాకారుల పనితీరును తెలుసుకున్నాను. నేను బీఏ హిందీ లిటరేచర్ స్టూడెంట్‌ని కావడంతో భాష సమస్య రాలేదు. మావారి సలహాతో నేను చేస్తున్న పనిని రిజిస్టర్ చేశాను. నాకు వచ్చిన ఆర్డర్లకు పని చేసివ్వడంతోపాటు పని నేర్చుకుంటామని వచ్చే మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాను. ఇదీ రొటీన్! ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల వేడి నీటిని తాగుతాను. అరగంట వాకింగ్, మరో అరగంట డాక్టర్ సూచించిన ఎక్సర్సైజ్లు. ఎనిమిదింటికి కాఫీ లేదా టీ, ఓ గంట సేపు ఫోన్లో మెసేజ్ లు చెక్ చేసుకుని నా క్లయింట్ల నుంచి ఆర్డర్లు, ఇతర సందేహాలకు రిప్లయ్ ఇస్తాను. పదిగంటలకు వంట, పూజ పూర్తి చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. రెండు గంటలు విశ్రాంతి. మధ్యాహ్న భోజనం తర్వాత మా వారు బయటకు వెళ్లినప్పటి నుంచి నా గదిలో పని మొదలు పెడితే ఏడు గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం. కొద్దిసేపు టీవీలో వార్తా విశేషాలు, గేమ్ షోలు కొద్దిసేపు టీవీ చూడడం పది గంటలకు నిద్ర. వారంలో మూడు రోజులు మా వాసవీ మహిళా సంఘం కార్యకలాపాలతో ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటాను. హడావుడిగా పరుగులు ఉండవు, కానీ పనిలో ఉంటాను. మా అబ్బాయి, అమ్మాయి కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు మా ఇంటికి వచ్చే ముందు ‘రేపు నీ పనులేంటమ్మా? మేము ఎప్పుడు రావచ్చు’ అని అడుగుతారు. పిల్లలు వాళ్ల ఉద్యోగాలు, వ్యాపారాల్లో, వాళ్ల పిల్లల చదువులతో బిజీగా ఉంటారు. పిల్లలు మన కోసం టైమ్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ వయసులో తరచూ నిరాశ ఎదురవుతుంటుంది. అందుకే నా టైమ్‌ని సహాయం అవసరమైన బాలికల చదువు, ఉపాధి కల్పనలో నిమగ్నం చేసుకుంటాను. లాభనష్టాల్లేకుండా నడిచే బాలికల హాస్టల్ నిర్వహణ, మహిళా సంఘం కార్యకలాపాలు సంయుక్తంగా చూసుకుంటాం. సహాయం అవసరమై వచ్చిన వాళ్లకు హాస్టల్లో వసతి ఇచ్చి, మహిళా సంఘం తరఫున స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తాం. ఉడాన్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లోనూ మెంబర్ని. దేశరక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పూర్తిగా అందనప్పుడు మా సంస్థ నుంచి వాళ్ల పిల్లల చదువు కోసం స్కూల్ ఫీజులు చెల్లిస్తాం. ఇదే మంచి సమయం! నా వయసు మహిళలకు నేను చెప్పగలిగిందొక్కటే... విశ్రాంత జీవితం శాపం కాదు, ఇది ఒక వరం. పిల్లలు మన మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చూసుకోవాలని కోరుకోకూడదు. ఎవరికి వాళ్లు తమకంటూ ఒక వ్యాపకాన్ని వృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, పూజలు, సత్సంగాలు, ఆలయాల సందర్శనం... ఏదైనా కావచ్చు. మనిషికి సోషల్ లైఫ్ ఉండాలి. ఇంటినుంచి బయటకు వస్తే పరిచయాలు పెరుగుతాయి. భావ సారూప్యం కలిగిన వాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో ప్రతిరోజూ సంతోషకరంగానే గడుస్తుంది’’ అన్నారు విజయా గుప్తా కోట్రికె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ను సొంతంగా నిర్వహిస్తూ మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో మహిళలు ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యధికంగా మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం అందింది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా గత మూడేళ్లలో క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం అందించారు. 2020–21 నుంచి 2022–23 నవంబర్ వరకు రాష్ట్రంలో మహిళల యాజమాన్యంలోని 2.21 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి రూ.1,181.14 కోట్లు అందించినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో మినహా గత మూడేళ్లలో మరే రాష్ట్రంలోనూ మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ఇంత పెద్ద సంఖ్యలో ఆర్థిక సాయం అందించలేదని తెలిపింది. ఆర్థిక సాయం ఇలా.. 2020–21లో దేశం మొత్తం మీద 1.71 లక్షల మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందించింది. రాష్ట్రంలో అత్యధికంగా 74,339 ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం లభించింది. ఏపీ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. అలాగే 2021–22లో దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 1.30 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందించగా.. రాష్ట్రంలో అత్యధికంగా 22,641 ఎంఎస్ఎంఈలకు సాయం దక్కింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్ నిలిచాయి. ఇక 2022–23లో నవంబర్ వరకు దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 2.34 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందగా రాష్ట్రంలో అత్యధికంగా 1.24 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు సాయం లభించింది. ఏపీ తర్వాత అత్యధికంగా సాయం అందుకున్న రాష్ట్రాల్లో జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ నిలిచాయని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెరిగిన ఎంఎస్ఎంఈలు 2021–22లో మహిళల యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలు 86.11% పెరిగినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 మార్చి 31 నాటికి మహిళల యాజమాన్యంలో దేశంలో 4,89,470 ఎంఎస్ఎంఈలుండగా గతేడాది మార్చి 31 నాటికి వీటి సంఖ్య 9,10,973కు చేరింది. మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా మొత్తం 19,59,778 మందికి ఉపాధి లభించినట్టు వివరించింది. ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలను ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. సుమారు రూ.3,409 కోట్ల మేర టీడీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించి ఎంఎస్ఎంఈలను ఆదుకుంది. అంతేకాకుండా మూడేళ్లుగా ఎంఎస్ఎంఈలకు సకాలంలో రాయితీలను చెల్లిస్తోంది. గత మూడేళ్లలోనే రూ.1,706.16 కోట్లను రాయితీల కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయిపట్టుకుని నడిపించేలా వ్యవహరిస్తోంది. సీఎం రాయితీలు అందించడం వల్లే.. ఎంఎస్ఎంఈ పథకం కింద కార్ల కోసం పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నా. నెల రోజుల్లోనే నాకు అనుమతి మంజూరైంది. రూ.14.50 లక్షలతో బొలేరో వాహనం, రూ.11.50 లక్షలతో బ్రిజా వాహనం కొనుగోలు చేశా. రెండు కార్లకు మొత్తం రూ.26 లక్షలు కాగా ఇందులో 45 శాతం సబ్సిడీ వచ్చింది. ఈ రెండు కార్లకు డ్రైవర్లను పెట్టుకొని బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు రాయితీలు అందించడం వల్లే పరిశ్రమలు వస్తున్నాయి. నాకు జీవనోపాధి కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ఎప్పటికీ మరిచిపోను. –ఎస్ఎల్ శిరోమణి, జ్ఞానాపురం, నంద్యాల (చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? ) -
తయారీ రంగం సుస్థిర వృద్ధి
న్యూఢిల్లీ: తయారీ రంగం సుస్థిర వృద్ధి బాటన కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. అయితే సూచీ 50పైన కొనసాగితే దీనిని వృద్ధి ధోరణిగా పేర్కొంటారు. 50 దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన పీఎంఐ 50పైన కొనసాగడం ఇది వరుసగా 20వ నెల. జనవరి తరహాలోనే కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి ఫిబ్రవరిలోనూ కొనసాగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. కాగా, ఉపాధి కల్పన విషయంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని లిమా పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న 98 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇక కంపెనీలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ కొనసాగుతున్నట్లు తెలిపారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రం, ప్రతిస్పందనల ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదుచేయడం జరుగుతుంది. -
అభివృద్ధిలో ‘బ్లూ ఎకానమీ’ కీలకపాత్ర
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ‘బ్లూ ఎకానమీ’ కీలక పాత్ర పోషించనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) గిరీష్ చంద్ర (జీసీ) ముర్ము విశ్లేషించారు. సుస్థిర వృద్ధి, సామాజిక, ఆర్థిక సంక్షేమం వంటి అంశాల విసృత ప్రాతిపదికన ఎకానమీ పురోగతికి సంబంధించి మున్ముందు బ్లూ ఎకానమీ కీలకం కానుందని ఆయన అన్నారు. బ్లూ ఎకానమీ ఇస్తున్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారత్ 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలను కలుపుతోంది. సముద్ర తీవ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 40 లక్షలకు పైగా మత్స్యకారులకు, ఇతర తీర ప్రాంత వర్గాలకు చక్కటి ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ► ఇక దాదాపు 199 ఓడరేవులు ఉన్నాయి, వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు దోహదపడుతూ, దేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ► రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి క్రూడ్, సహజవాయువులుసహా విస్తారమైన వనరులను కలిగిఉంది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) సాధనకు బ్లూ ఎకానమీ కీలక భూమికను పోషించనుంది. బ్లూ ఎకనమీ అంటే.. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం క్లుప్తంగా బ్లూ ఎకానమీ అర్థాన్ని పరిశీలిస్తే... ఇది సము ద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ. సముద్ర పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ఇందుకు అనుగుణమైన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దీని లక్ష్యం. ఉపాధి కల్పన మెరుగుదలకు సముద్ర వనరుల ను స్థిరంగా, పటిష్ట స్థాయిలో వినియోగించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. ‘‘సముద్రాలు, సముద్ర తీరాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలే బ్లూ ఎకానమీ’’ అని యూరోపియన్ కమిషన్ నిర్వచించింది. 2022–2023లో భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడంతో, ఈ సందర్భంగా బ్లూ ఎకానమీకి సంబంధించి జరుగుతున్న ఎస్ఏఐ20 సదస్సు బాధ్యతలను కాగ్ నిర్వహిస్తున్నారు. బ్లూ ఎకానమీపై అధ్యయనంపై ఈ సదస్సు దృష్టి పెట్టనుంది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధికి ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను, విధానాలను ఎలా రూపొందించవచ్చు, అమలుచేయవచ్చు వంటి అంశాలపై ఎస్ఏఐ20 అధ్యయనం చేస్తుంది. -
ఆకాంక్షలు నెరవేరేనా
వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న చివరి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ఇదే. ఎంత కాదన్నా బడ్జెట్ నిర్ణయాలు, కేటాయింపుల ప్రభావం కొన్ని వర్గాలపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు 9 ఏళ్లుగా పాలిస్తోంది. మరోసారి ప్రజామోదం కోసం బడ్జెట్‌ను ఒక అవకాశంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావిస్తారా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటారా? అన్నది ఫిబ్రవరి 1న తేటతెల్లం అవుతుంది. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పన్నుల భారాన్ని తగ్గించాలన్న మధ్యతరగతి వాసుల వినతులు, వివిధ రంగాల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలేదు. డిమాండ్ పరిస్థితులు దీన్నే తెలియజేస్తున్నాయి. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్ప్రేరణకు ఆర్థిక మంత్రి ఏం చేస్తారో చూడాలి. నిర్మలమ్మకు ఇది ఐదో బడ్జెట్ కానుంది. మధ్యతరగతికి ‘ఐటీ’ తాయిలం..? రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదు. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లుగా ఇదే బేసిక్ పరిమితి కొనసాగుతోంది. రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించారు. కానీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఔషధాల భారాన్ని దింపరూ.. పరిశోధన, అభివృద్ధికి, ఫార్ములేషన్, ఏపీఐల తయారీకి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఔషధాలపై జీఎస్టీని సులభతరం చేయాలని కోరుతున్నాయి. దేశ ఫార్మా పరిశ్రమ 2023 ముగిసే నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా ఉంది. ఫార్మా పరిశ్రమ ఔషధ పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సేవలను అందిస్తున్నా.. సేవల ఎగుమతి ప్రోత్సాహక పథకం (ఎస్ఈఐఎస్) కింద ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని, తమకూ వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. ఆరోగ్యం కోసం ప్రజలు జేబు నుంచి చేసే ఖర్చు 65 శాతంగా ఉందని, కనుక ఔషధాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల ఈ భారాన్ని దింపొచ్చని పరిశ్రమ కోరుతోంది. పాలసీదారులు/బీమా కంపెనీలు మనదేశంలో బీమా వ్యాప్తి ఇప్పటికీ అంతర్జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పెట్టుకుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎంతో మందికి భారంగా పరిణమించిదని, దీన్ని 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోంది. ఉదాహరణకు రూ.10,000 ప్రీమియంపై రూ.1800 పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పన్ను తగ్గింపుతో ప్రీమియం తగ్గడం వల్ల మరింత మంది బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తారని పరిశ్రమ చెబుతోంది. ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నెరవేర్చితే అది కచ్చితంగా బీమా వ్యాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా అధిక కవరేజీనిచ్చే టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతుంని పరిశ్రమ అంటోంది. హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం ఒక కుటుంబానికి రూ.25,000 వరకు ఉంటే సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు కావాలని, యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) ఆదాయంపై పన్ను ఎత్తేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మరింత పన్ను మినహాయింపు ఇవ్వాలని బీమా రంగం కోరుతోంది. ఉపాధి కల్పన అమెరికా, యూరప్‌లో ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుక ఉపాధి కల్పన, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రతిపాదనలకు చోటు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఉపాధి కల్పన లక్ష్యంతోనే మోదీ సర్కారు భారత్‌లో తయారీ విధానాన్ని ఎంచుకుంది. దీనికింద ఆత్మనిర్భర్ (స్వావలంబన) భారత్ పేరుతో దేశీ తయారిని ప్రోత్సహించే పలు విధానాలను ఇప్పటికే చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఇప్పటికే 14 రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మరిన్ని రంగాలు తమకు సైతం పీఎల్ఐ ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్నాయి. వీటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారన్నది బడ్జెట్‌తో తెలుస్తుంది. స్టార్టప్‌లకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనికి కూడా కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కింద కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ద్వారా ఉపాధి కల్పించొచ్చనే సూచనలు వస్తున్నాయి. ఫిన్‌టెక్/ఎంఎస్ఎంఈ దేశీ ఫిన్‌టెక్ పరిశ్రమ తమకు మరిన్ని మద్దతు చర్యలు కావాలని కోరుతోంది. అందరికీ ఆర్థిక సేవల చేరువలో తమ పాత్ర కీలకమని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు కీలకంగా వ్యవహరిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం అవసరాలు తీర్చడంలోనూ ఫిన్‌టెక్ పరిశ్రమ చేస్తున్న సేవలను గుర్తు చేసింది. 45 శాతం మందికి ఉపాధినిస్తూ, జీడీపీలో 30 శాతం వాటాను ఎంఎస్ఎంఈ పరిశ్రమ కలిగి ఉంది. కనుక బడ్జెట్ ప్రతిపాదనల పట్ల ఫిన్‌టెక్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. కార్పొరేట్ రంగం డిమాండ్.. కొత్తగా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే దేశీ కంపెనీలకు అతి తక్కువగా 15 శాతం కార్పొరేట్ పన్నును కేంద్రం లోగడ ప్రకటించింది. 2024 మార్చి 31లోపు తయారీ కార్యకలాపాలు ఆరంభించేవి ఈ ప్రయోజనం పొందొచ్చు. ఈ గడువును పొడిగించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని, తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయట పడేందుకు కంపెనీలకు సమయం పట్టిందని.. ఇప్పుడు నూతన పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నందున గడువు పొడిగించాలనే డిమాండ్ ఉంది. కొత్త ప్లాంట్ తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కనీసం 2–3 ఏళ్లు పడుతుందని, కనుక ప్రస్తుత గడువు చాలదన్న అభిప్రాయం ఉంది. ఆదాయపన్ను విషయంలో ఊరట కల్పిస్తే అది హౌసింగ్ పరిశ్రమ వృద్ధికి మేలు చేస్తుందని రియల్టీ భావిస్తోంది. భారీ ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం తమకు క్షేత్రస్థాయిలో రుణ లభ్యత సమస్యగా ఉందని చెబుతోంది. ఎంఎస్ఎంఈ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కీలకమైన ఆటోమొబైల్ రంగం పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. కనిష్టంగా 28%, గరిష్టంగా 40 శాతానికి పైనే వాహనాలపై పన్నుల భారం వేస్తున్నారని.. మార్కెట్ విస్తరణకు ఇది అవరోధంగా నిలుస్తున్నట్టు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్ కోర్కెలు మూలధన లాభాల పన్ను పరంగా ఉపశమనం కల్పిస్తే అది మార్కెట్లకు మంచి జోష్‌నిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెట్, ఈక్విటీ, ప్రాపర్టీలకు వేర్వేరు మూలధన లాభాల పన్ను, హోల్డింగ్ పీరియడ్ అమలవుతున్నాయి. వీటి మధ్య ఏకరూపతకు అవకాశం ఉందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఇప్పటికే సంకేతం ఇచ్చింది. ఈ క్రమంలోనే మూలధన లాభాల పన్ను విషయమై అంచనాలు ఏర్పడ్డాయి. దీర్ఘకాల మూలధన లాభాలపై నష్టాన్ని, స్వల్పకాల మూలధన లాభాలతో సర్దుబాటుకు అవకాశం లేదు. విద్యారంగం దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విద్యా సంస్థలకు మోదీ సర్కారు ఆహ్వానం పలికింది. విద్యా సేవలపై జీఎస్టీ భారాన్ని తొలగించడం లేదంటే తగ్గించాలని విద్యా సంస్థలు కోరుతున్నాయి. దేశంలో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి పిరమిడ్ మాదిరి చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అందుకుని ఉన్నత విద్యలోనూ మరింత మంది చేరేందుకు వీలుగా ఆకర్షణీయమైన రుణ పథకాలు, స్కాలర్షిప్లు ప్రకటించాలనే డిమాండ్ ఉంది. గృహ కల్పన అందరికీ ఇల్లు అనేది మోదీ సర్కారు నినాదం. దీని సాకారానికి వీలుగా రుణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని హౌసింగ్ పరిశ్రమ కోరుతోంది. అందుబాటు ధరల ఇంటికి నిర్వచనాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ఉంది. నిర్మాణ రంగ మెటీరియల్ అయిన స్టీల్, సిమెంట్‌పై జీఎస్టీ తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువును మరింత కాలం పెంచాలని కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణంపై కొంత రాయితీ లభిస్తుంది. రైతులను చూస్తారా..? సాగు రంగం నుంచి డిమాండ్ల చిట్టా పెద్దదిగానే ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా సాగుకు కావాల్సిన ముడి సరుకుల కోసం ఇస్తున్న రూ.6,000ను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనివల్ల రైతులు రుణాలతో పనిలేకుండా సాగుకు కావాల్సిన ముడి పదార్థాలను కొనుగోలు చేసుకోగలరన్న సూచన ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందించాలనే డిమాండ్ సైతం ఉంది. అగ్రి టెక్ స్టార్టప్‌లకు రాయితీలు కల్పించాలని, ఆగ్రోకెమికల్స్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. సాగులో టెక్నాలజీ విస్తరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు చర్యలు ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ముడి చమురు మాదిరే వంట నూనెల విషయంలోనూ 65 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీంతో ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్’ పేరుతో నూనె గింజల సాగుకు ఆర్థిక సహకారం అందించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఏటా రూ.25,000 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించాలని కేంద్రానికి సూచించింది. దీనివల్ల దిగుమతులను 30 శాతానికి తగ్గించొచ్చని పే ర్కొంది. సాగు రంగంలో పరిశోధన, అభివృద్దికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ధనూకా గ్రూప్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్న బడ్జెట్లో వ్యవసాయానికి మెరుగైన కేటాయింపులు చేస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్‌కు పెద్ద పీట వేస్తారా? ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగానికి బడ్జెట్లో కేటాయింపులను 20–30 శాతం పెంచాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని గర్తు చేసింది. హెల్త్‌కేర్ రంగానికి 2022–23 బడ్జెట్లో 16.5 శాతం అధికంగా రూ.86,200 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ విడత కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపుల పట్ల భారీ అంచనాలతో ఉన్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా హెల్త్‌కేర్ పరిశ్రమ డిజిటైజేషన్‌కు అదనపు నిధులు అవసరమని అపోలో టెలీహెల్త్ సీఈవో విక్రమ్ తాప్లూ అభిప్రాయపడ్డారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకటించినప్పటికీ, వీటి విస్తరణకు మరిన్ని నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్ సేవల విస్తరణకు అధిక నిధుల కేటాయింపు అవసరమని డాక్టర్ అగర్వాల్ సైతం పేర్కొన్నారు. స్వచ్చందంగా మెడికల్ ఇన్సూరెన్స్‌కు ప్రతిపౌరుడికీ అవకాశం కల్పించాలని కోరారు. అది కూడా ఉచితంగా అందించాలని సూచించారు. కేన్సర్ కేర్ వసతుల పెంపునకు మరిన్ని నిధులు అవసరమని నిపుణుల సూచనగా ఉంది. హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధి కేటాయించాలనే డిమాండ్ సైతం ఉంది. – బిజినెస్ డెస్క్ -
రానున్నది బ్యాలెన్స్డ్ బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమతుల్యంగా ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఉపాధి కల్పనతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. పన్నుల పరంగా సౌలభ్యం, ద్రవ్యోలోటును నియంత్రణలో ఉంచి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతారన్న అభిప్రాయాలు నిపుణులు, ఇన్వెస్టర్ల నుంచి వినిపించాయి. ‘‘ఎన్నికల ముందు బడ్జెట్ నుంచి ఇన్వెస్టర్లు మూడింటిని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏకీకృత పన్ను నిర్మాణం ఇందులో ఒకటి. దీనివల్ల ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన ద్రవ్య స్థిరీకరణ రెండోది. వృద్ధికి అవరోధాలుగా మారిన సబ్సిడీల స్థిరీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, పీఎస్‌యూల ప్రైవేటీకరణ లేదా స్థిరీకరణపై చర్య లు ఉంటాయని అంచనా వేస్తున్నారు’’అని ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి తెలిపారు. ఈ నెల ఇప్పటి వరకు మార్కెట్లు ఫ్లాట్‌గా ఒక శ్రేణి పరిధిలోనే ట్రేడ్ అవుతుండడం తెలిసిందే. కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చేంత సానుకూలంగా లేవు. కనుక బడ్జెట్ ప్రతిపాదనలపైనే మర్కెట్ గమనం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.16,500 కోట్ల అమ్మకాలు చేశారు. చౌక వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్న చైనా తదితర వర్ధమాన మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం భయాలు కూడా ఇన్వెస్టర్ల మనుసుల్లో ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. గడిచిన పదేళ్లలో బడ్జెట్‌కు ముందు ఆరు సందర్భాల్లో మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. గత పదేళ్లలో బడ్జెట్ తర్వాత ఆరు సందర్భాల్లో మార్కెట్లు నష్టపోయాయి. బడ్జెట్ రోజు నిఫ్టీ–50 ఏడు సందర్భాల్లో నష్టాలను చవిచూసింది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకు సానుకూలించే చర్యలు బడ్జెట్లో ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుంటాయి. ప్రతికూల ప్రతిపాదనలు ఉంటే నష్టపోతుండడం సహజం. కానీ, ఇది తాత్కాలిక పరిణామంగానే ఉంటుంది. మూలధన లాభాల పన్ను పెంచితే ప్రతికూలం ‘‘వచ్చే బడ్జెట్ ప్రభావం అన్నది అందులోని ప్రతిపాదనలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 2023–24 ద్రవ్యలోటును మార్కెట్లు జాగ్రత్తగా గమనిస్తాయి. 6 శాతానికి పైన అంచనాలు ఉంటే అది మార్కెట్లను నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఇది జరగకపోవచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మూలధన లాభాల పన్నును పెంచితే అది మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుందున్నారు. ఆర్థిక వ్యవస్థ లేదా ఖర్చు చేసే ఆదాయం మిగులుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నా కానీ, అవి మార్కెట్‌పై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తాయని జార్విస్ ఇన్వెస్ట్ సీఈవో సుమీత్ చందా అభిప్రాయపడ్డారు. వేతన జీవుల పన్ను శ్లాబుల్లో మార్పులు లేదా కంపెనీల మూలధన వ్యయాలకు ప్రోత్సాహకాలు లేదా పన్నుల తగ్గింపు చర్యలు ఉంటే మార్కెట్లలో ర్యాలీని చూస్తామన్నారు. పీఎల్ఐ పథకం విస్తరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు, పన్ను శ్లాబుల్లో ఉపశమనం చర్యలు ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని అన్మి ప్రెసిడెంట్ కమలేష్‌షా అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై చాలా స్వల్పకాలమేనని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు తదుపరి మార్కెట్లను నడిపించే అంశాలుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 ఫెడ్ వ్యాఖ్యలు డోవిష్‌గా ఉండి, ద్రవ్యోల్బణం దిగొస్తే మార్కెట్లు ర్యాలీ చేస్తాయని జియోజిత్ విజయ్‌కుమార్ అంచనా వేస్తున్నారు. హెల్త్‌కేర్, ఫెర్టిలైజర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఇన్సూరెన్స్, తయారీ, డిజిటలైజేషన్, కమ్యూనికేషన్, విద్య, ఎస్ఎంఈ రంగాలకు బడ్జెట్లో ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాంటార్ సర్వే అనలైటిక్స్ సంస్థ కాంటార్ బడ్జెట్‌కు ముందు నిర్వహించిన సర్వే అంశాలను పరిశీలించినట్టయితే.. ► ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగాల తొలగింపులపై ఆందోళనతో ఉన్నారు. ► ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళకరమని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరమని చెప్పారు. ► సగం మంది దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వృద్ధి బాటలో కొనసాగుతుందని భావిస్తుంటే, 31 శాతం నిదానిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ► మెట్రో జనాభాతో పోలిస్తే నాన్ మెట్రోల్లో 54 శాతం మంది ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ► ఆదాయపన్ను మినహాయింపుగా ఉన్న బేసిక్ పరిమితి రూ.2.5 లక్షలను పెంచొచ్చన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపించింది. అలాగే, గరిష్ట పన్ను 30 శాతం శ్లాబ్‌కు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచొచ్చనే అంచనా వ్యక్తమైంది. ► సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా రాయితీలు పెంచుతారని మూడింట ఒక వంతు మంది చెప్పారు. ► కరోనా మహమ్మారి దాదాపు ముగిసినట్టేనని, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని 55 శాతం మంది కోరుతున్నారు. ► హైదరాబాద్ సహా 12 పట్టణాల్లో గత డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 మధ్య కాంటార్ సర్వే జరిగింది. 21–55 సంవత్సరాల వయసులోని 1,892 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్‌లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్‌తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్‌లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్‌తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్‌లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్‌లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్‌లో మొత్తం 63 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్‌లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
కడప కార్పొరేషన్: యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలోని ప్రభుత్వ ఐటీ కళాశాలల ఆవరణలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు(స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ) చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా సీఎం జగన్ రెండు స్కిల్ వర్సిటీలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సజ్జల సిద్దవటం: అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలోని నేకనాపురానికి సమీపంలో డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ తక్కోలి మాచిరెడ్డి దంపతులు నిర్మించిన జీవని వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆశ్రమానికి తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు పాల్గొన్నారు. -
‘ఆ పది కోట్ల మంది ఉద్యోగాలకు పనికిరారు’
సాక్షి, న్యూఢిల్లీ : అపార మానవ వనరులతో అవకాశాల గనిగా పేరొందిన భారత్ తన ప్రతిష్టను కోల్పోనుందా అనే ఆందోళన రేకెత్తుతోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు దీటుగా ఎదగని కోట్లాది యువత నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా మిగిలే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 21 నుంచి 35 ఏళ్ల మధ్యన ఉన్న పదికోట్ల మంది యువత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు దీటుగా మెరుగైన నైపుణ్యాలను సంతరించుకోలేదని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి భారత్‌లో మరో పది కోట్ల మంది నాణ్యత లేని మానవ వనరులు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని, దీంతో 21 నుంచి 45 ఏళ్ల వయసుగల ఉద్యోగుల్లో తక్కువ నాణ్యత, దిగువ స్థాయి విద్యార్హతలతో ఉన్న సిబ్బంది సంఖ్య 20 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో విద్యా సంస్కరణలు లోపించడమే ఈ దుస్థితికి కారణమని గతంలో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా వ్యవహరించిన పాయ్ విమర్శించారు. విద్యా సంస్కరణల ఫలితాలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టినా పదేళ్లకు వాటి ఫలాలు అందివస్తాయని ఫలితంగా ఒక తరం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నారు. ఈ నష్టాన్ని నివారించడమే ప్రస్తుతం మన ముందున్న సవాల్ అన్నారు. -
ట్రంప్ లక్ష్యం ఉపాధి కల్పనేనా?
సందర్భం నేడు ఆయా దేశాలలో పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్య నేపధ్యంలోనే బ్రిట న్లో ‘‘బ్రెగ్జిట్’’, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు, ఫ్రాన్స్ వంటి దేశాలలో అనేక చోట్ల మితవాద నేతలూ, పార్టీల ఎదుగుదల జరుగుతున్నాయి. ధనిక దేశాలలోని ఈ నిరుద్యోగ సమస్యకు అక్కడికి వలస వచ్చిన విదేశీయులూ, లేదా తమ తమ దేశాలనుంచి ఉద్యో గాలు చైనా, భారత్, మెక్సికోల వంటి తక్కువ వేతనాలు ఉన్న దేశాలకు ‘‘అవుట్ సోర్సింగ్’’ రూపంలో తరలిపోవడం కారణ మని ఈ మితవాద పార్టీలూ, నేతలూ ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో ట్రంప్, ఆయన విధానాల సారాంశాన్నీ అర్థం చేసుకోగలిగితే, మిగతా ప్రపంచంలో జరుగుతున్న పరిణామా లను సులువుగా అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో నిరుద్యోగం పెరగటానికి ప్రవాసితులూ, అవుట్ సోర్సింగ్లే కారణమనేది ట్రంప్‌లాంటి వారి వాదన. కాబట్టి కొత్తగా వచ్చే ప్రవాసితులను అడ్డుకుంటే, ఇప్పటికే అక్కడ ఉన్న వారిని ఏదో ఒక సాకుతో స్వదేశాలకు పంపేస్తే అమెరికాలో ‘‘స్థానికులకు’’ భారీగా ఉద్యో గాలు వస్తాయనీ, తద్వారా తన ఘనమైన గతాన్ని అమెరికా తిరిగి పొందుతుందనేది ట్రంప్ వాదనల సారాంశం. నిజానికి అమెరికాలో, బ్రిటన్‌లో లేదా ఫ్రాన్స్‌లోని సాధారణ జనాలలో కూడా తమ నిరుద్యోగానికి ప్రవాసితులే కారణం అనే దురభిప్రాయం నెలకొని ఉంది. అయితే, ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. నేడు నిరుద్యోగ సమస్య తాలూకు తీవ్రత పెరగటం అనేది, కాస్తో కూస్తో తేడాలతో ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిణామమే! భారత్‌లో కూడా 2013, 2014 సంవత్సరాలలో సుమారుగా 4,30,000 మందికి ఉపాధి కల్పన జరిగింది. కాగా, ‘మేకిన్ ఇండియా’ (2014, సెప్టెంబర్) కాలంలో 2015లో కల్పించిన ఉపాధిSకేవలం 1,35,000 మాత్రమే! 2016 పరిస్థితీ ఆశావహంగా లేదు. నిజానికి నేడు సగటున రోజుకు 550 ఉద్యోగాలను మన దేశం కోల్పోతోంది. కాగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశా లలో లాగా, మన దేశంలోకి ప్రవాసితులెవ్వరూ ఉపాధికోసం రావడం లేదు. అలాగే, విదేశీయులకు ఉద్యోగాలను కల్పించని చైనాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా గత కొన్నేళ్లుగా ఎంతో కొంతమేర నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. ఇలాగే అనేకానేక ఇతర అభివృద్ధి చెందుతోన్న దేశాలలో కూడా జరుగుతోంది. కాబట్టి నేడు నిరుద్యోగ సమస్య పెరుగుదల అనేది ఏ ఒక్క ప్రత్యేక దేశం తాలూకు విడి సమస్య కాదు. ఇది, తీవ్రతలో కాస్తో కూస్తో తేడాలతో అన్ని దేశాలలోనూ జరుగుతోన్న పరిణామమే! నిజానికి ఈ సమస్య మూలం ప్రవాసితులలోనో, కేవలం అవుట్ సోర్సింగ్లోనో కాకుండా వేగం పుంజుకుంటున్న యాంత్రీకరణ, పారిశ్రామిక రోబోట్ల వినియోగంలోనూ ఉంది. ఒక సర్వే ప్రకారం నేడు అమెరికాలో మిగిలివున్న ఉద్యోగాలలో 47% రాబోయే దశాబ్ద కాలంలో, యాంత్రీకరణ వలన పోతాయి. అలాగే భార త్లో ఈ సంఖ్య 69%గా ఉంది. అదీ కథ! మరి పెట్టుబడిదారుల లాభాల వేటలో జరుగుతోన్న యాంత్రీకరణ వలన పెరిగిపోతోన్న, నిరుద్యోగ సమస్యకు భారత్, చైనా, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల నుంచి వస్తోన్న ప్రవాసితులే కారణమని ట్రంప్ వంటి వారు ఎందుకు చెబుతోన్నట్టు? ముఖ్యంగా ధనిక దేశాలలోని సామాన్య ప్రజలు మెల్ల మెల్లగా పెద్ద ఎత్తున కార్పొరేట్ ధనవంతులూ, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ‘‘మేము 99% మందిమి’’ వంటి నినాదంతో ‘‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’’ వంటి ఉద్యమాలలో మమేకం అవుతూ ఉండడమే! 2011లో అమెరికాలో జరిగిన ఈ ఆక్యుపై ఉద్యమం, కేవలం 1% మందిగా ఉన్న అమెరికా కార్పొరేట్ ధన వంతుల వల్లే తమ సమస్యలు పెరుగుతున్నాయన్న, 99% మంది అమెరికా సామాన్య జనం తాలూకు ఆక్రోశానికి ప్రతిబింబంగా ఉంది. ఈ ఉద్యమం నాడు ప్రపంచంలోని 800 నగరాలకు విస్తరిం చింది. మన ముంబైలో కూడా ‘‘ఆక్యుపై దలాల్ స్ట్రీట్’’ పేరిట చిన్న స్థాయిలోనైనా ఈ ఉద్యమ ప్రతిధ్వని వినపడింది. ఇక ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ప్రభావం 2016 నవంబర్‌లో జరిగిన అమెరికా ఎన్నికల క్రమంలో డెమోక్రటిక్ పార్టీలో అభ్యర్థి అయిన సోషలిస్ట్ బెర్నీ శాండర్స్ రూపంలోనూ కనపడింది. నిజానికి, అమెరికా యువ జనులలోని 80% మంది ఆకాంక్షలకు బెర్నీ శాండర్స్ ప్రతినిధి అనీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు, హిల్లరీ క్లింటన్ కంటే శాండర్సే మెరుగైన అభ్యర్థి అనీ, నాడు అమెరికా పత్రికలే పలుమార్లు చెప్పాయి. ఇదీ విషయం!!! ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్లూ, బ్రెగ్జి ట్లూ, ఫ్రాన్స్ వంటి దేశాల మితవాదులూ అందరి టార్గెట్ ఒకటే. తమ తమ దేశాలలోని సామాన్య ప్రజలు కార్పొరేట్లకూ, ధనవంతులకూ వ్యతిరేకంగా జమవుతోన్న పరిణామాన్ని నిరో ధించటమే. ఆ ప్రజల ఐక్యతని విచ్ఛిన్నం చేయటమే. తద్వారా ప్రపంచంలో పెరిగిపోతోన్న ఆర్థిక అసమానతలూ, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి వారిమధ్య జాతి వైషమ్యాలూ, దేశీయ విదేశీ ఉద్యోగులూ వంటి విద్వేషాలను రెచ్చగొట్టటమే. కాబట్టి జనాలు తమ సమ స్యలకు అసలు కారణం నుంచి దృష్టిని మళ్ళిస్తే అది వారు తమ వేలితో తమ కన్నే పొడుచుకున్నట్లుగా అవుతుంది. - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ మెుబైల్ : 98661 79615 -
‘మూడింది!
► ‘ఉపాధి’ కల్పనలో దిగజారిన ‘అనంత’ స్థానం ► తొలి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన జిల్లా ► చివరి నిమిషంలో విశాఖ, విజయనగరం ముందంజ ► మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూలీలకు ‘ఉపాధి’ కల్పనలో ‘అనంత’ స్థానం దిగజారిపోయింది. తొలి నుంచి రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన జిల్లా..ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొదట్నుంచీ అల్లంత దూరంలో ఉన్న విశాఖపట్నం ఇప్పుడు నెంబర్‌వన్ అయ్యింది. విజయనగరం రెండోస్థానాన్ని దక్కించుకుంది. అనంతపురం సెంట్రల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పనలో జిల్లా అధికారులు వెనుకబడిపోయారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 93,611 కుటుంబాలకు మాత్రమే వందరోజుల పని కల్పించారు. ఇందుకోసం రూ.556 కోట్లు ఖర్చు చేశారు. పనులు పొందిన కుటుంబాల సంఖ్య తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ‘అనంత’ మూడోస్థానానికి పడిపోయింది. ఈ పథకం అమలుకు సంబంధించి ర్యాంకుల కేటాయింపునకు 100 రోజుల పని పొందిన కుటుంబాలను ప్రామాణికంగా తీసుకుంటారు. విశాఖపట్నం జిల్లాలో రూ.475 కోట్లు ఖర్చు చేసి 1,05,512 కుటుంబాలకు, విజయనగరం జిల్లాలో రూ.482 కోట్లు ఖర్చు చేసి 99,460 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. దీంతో అవి మొదటి, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ రెండు జిల్లాలు నెల క్రితం మన జిల్లా కంటే పది వేల కుటుంబాలు వెనుకబడి ఉన్నాయి. అయితే.. చివరి నిమిషంలో ఎక్కువ మంది కూలీలు పనుల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిధులు ఖర్చు చేయడంలో మాత్రం అనంతపురం జిల్లానే అగ్రస్థానంలో నిలవడం ఊరట కల్గించే అంశం. చేజేతులా.. జిల్లాస్థానం పడిపోవడానికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు, వారి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మార్చి 26 నాటికి జిల్లాలో వంద రోజులు పూర్తి చేసుకోవడానికి మూడు రోజులు తక్కువ ఉన్న కుటుంబాలు 20వేల పైచిలుకు ఉన్నాయి. వీటిని ఆ మూడు రోజులు పనిలో పాల్గొనేలా చర్యలు తీసుకొని ఉంటే అగ్రస్థానానికి ఢోకా ఉండేది కాదు. ఈ విషయంలో అధికారులు విఫలమయ్యారు. ఉపాధిహామీ చట్టం ప్రకారం కూలీలు అడిగిన పని కల్పించాలి. జిల్లాలో మాత్రం ఫారంపాండ్లు చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. కష్టతరమైన ఈ పనికి కూలీలు రావడం లేదు. ఎక్కువశాతం ఎర్రనేలలు ఉండటంతో మట్టిని తవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూలీలు అడిగిన పని మంజూరు చేస్తున్నారు. దీనివల్ల అవి ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకున్నాయి. ► జిల్లాలో జాబ్‌కార్డు పొందిన కుటుంబాలు : 7.87 లక్షలు ► పనులకు సక్రమంగా హాజరవుతున్న కూలీలు : 4.27 లక్షలు ► వందరోజుల పని కల్పించిన కుటుంబాలు : 93,611 ► కూలీలపై ఖర్చు : రూ. 226 కోట్లు ► మొత్తం ఖర్చు : రూ. 556 కోట్లు -
ఉపాధి కల్పనకు ప్రణాళికలు
ఖమ్మం జెడ్పీ సెంటర్: జిల్లాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సాధ్యనమైనంత త్వరగా ప్రణాళికలు రూపొంది స్తామని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శనివా రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈజీ ఎస్, జాతీయ జీవనోపాధి మిషన్ పథకాలను సమర్థంగా అమలు చేసే సీఎఫ్‌టీ (క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం) ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం ఎంపిక చేసిన గ్రామాల్లో పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కింద డ్వామా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వివరించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సంద ర్భంగా రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి గల సీఎఫ్‌టీ ప్రాజెక్టు సంబందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు త్వరగా తయారు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.