ఖమ్మం జెడ్పీ సెంటర్: జిల్లాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సాధ్యనమైనంత త్వరగా ప్రణాళికలు రూపొంది స్తామని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శనివా రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈజీ ఎస్, జాతీయ జీవనోపాధి మిషన్ పథకాలను సమర్థంగా అమలు చేసే సీఎఫ్‌టీ (క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం) ప్రాజెక్టుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం ఎంపిక చేసిన గ్రామాల్లో పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కింద డ్వామా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వివరించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ పనులను క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సంద ర్భంగా రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి గల సీఎఫ్‌టీ ప్రాజెక్టు సంబందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు త్వరగా తయారు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పనకు ప్రణాళికలు
Published Sun, Jul 27 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement