నూతనోత్సాహం | telangana celebrations conducted in district | Sakshi
Sakshi News home page

నూతనోత్సాహం

Published Tue, Jun 3 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

telangana celebrations conducted in district

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జెండావిష్కరణ చేపట్టారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయపార్టీలు, ఉద్యోగసంఘాల కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు.

 జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తన క్యాంపు కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యోగులు, జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. శాంతికపోతాలను ఎగురవేశారు. కలెక్టరేట్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మహిళా ఉద్యోగినులు బతుకమ్మలు, బోనాలు, గంగిరెద్దుల ఆటలతో ఆకట్టుకున్నారు. కోలాట నృత్యాలతో సందడి చేశారు. ఈ ప్రదర్శనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీ సురేంద్రమోహన్, అదనపు జేసీ బాబూరావు, జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణలు ఓపెన్‌టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుకు సాగారు. పోలీసులు కవాతు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు.

 ఈ ప్రదర్శన కలెక్టరేట్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్, బస్టాండ్‌మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. అక్కడ వేద పండితులు పూర్ణకుంభంతో కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగానికి స్వాగతం పలికారు. కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో జిల్లా అన్ని రంగాల్లో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరుతూ బెలూన్లను గాలిలోకి వదిలారు. తన క్యాంపు కార్యాల యంలో జేసీ జెండా ఆవిష్కరించారు.

 జిల్లా పరిషత్‌లో తెలంగాణ సంబురాలు మిన్నంటాయి. ఉద్యోగులు స్వీట్లు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జెడ్పీ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి సీఈవో జయప్రకాష్‌నారాయణ, ఏవో ఇంజం అప్పారావు, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజులు పూలమాలలు వేశారు. సీఈవో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లయ్య, శ్రీనివాస్, నాయకులు రవీందర్‌ప్రసాద్, రామకృష్ణారెడ్డి, కిషోర్‌రెడ్డి, వాణిశ్రీపాల్గొన్నారు.

 భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో దివ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో అమయ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో డెరైక్టర్ (ఆపరేషన్స్) రమేష్‌కుమార్, జిల్లా పోలీస్ కేంద్రంలో డీటీసీ డీఎస్పీ గంగారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. పం చాయతీ రాజ్ ఎస్‌ఈ కార్యాలయం లో గంగారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డీఈ మహేష్‌బాబు, ఈఈ రాం బాబు, శివగణేష్ పాల్గొన్నారు.

 ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ బి.శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, కోడి లింగయ్య, కోటేశ్వరరా వు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఆర్డీవో సం జీవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దుమ్ముగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చిరంజీవులు, బాబూరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల్, హసన్, రామారావు, రంగయ్య పాల్గొన్నారు.

ట్రెజరీ కార్యాలయంలో డీడీ నీలిమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖాజామియా, కృష్ణారావు, వేలాద్రి, వల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు, ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీవో మెహిమిన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు రవీందర్, ఈశ్వరయ్య, ఏవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డీఆర్‌డీఏలో పీడీ శ్రీనివాస్‌నాయక్ జాతీయజెండాను ఆవిష్కరించారు. డ్వామాలో పీడీ వెంకటనర్సయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అప్పారావు, మీరా, రాజేష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement