
న్యూఢిల్లీ: తయారీ రంగం సుస్థిర వృద్ధి బాటన కొనసాగుతోంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. అయితే సూచీ 50పైన కొనసాగితే దీనిని వృద్ధి ధోరణిగా పేర్కొంటారు. 50 దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన పీఎంఐ 50పైన కొనసాగడం ఇది వరుసగా 20వ నెల.
జనవరి తరహాలోనే కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి ఫిబ్రవరిలోనూ కొనసాగినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. కాగా, ఉపాధి కల్పన విషయంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని లిమా పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న 98 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇక కంపెనీలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ కొనసాగుతున్నట్లు తెలిపారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానల్‌లో కొనుగోళ్లు జరిపే మేనేజర్‌లకు పంపిన ప్రశ్నాపత్రం, ప్రతిస్పందనల ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదుచేయడం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment