
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాల ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాల్సి రావడం బాధాకరం. శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలూ ఇదే సమయంలో జరుపుకోవాల్సి వచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దలను సీఎం కోరారని’ ఆయన వెల్లడించారు.
(ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం)
మత పెద్దలు ఈ విషయాన్ని సీఎం మాటగా ప్రతి సోదరుడికి తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కరోనా సమయంలో మనకున్న ఒకే ఒక్క ఆయుధం భౌతిక దురమేనని సీఎం చెప్పారని.. ఈ నియమాన్ని పాటిస్తూ అందరూ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు. ఫేక్ మెసేజ్ ద్వారా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు సీఎం దృష్టికి తీసుకువచ్చారని.. అటువంటి వారిని ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ డీజీపీకి ఆదేశాలిచ్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment