
సాక్షి, అమరావతి : గత నెల మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయమై తాను ఢిల్లీ వెళ్లానని, మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. తాను మర్కజ్ జమాత్లో జరిగిన ఇస్తమాకు వెళ్లినట్లు ఎల్లోమీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఢిల్లీ సభలకు వెళ్లలేదని నిరూపిస్తే ఛానల్‌ను మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారం చేసిన ఎల్లోమీడియాపై.. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. కాగా, గత నెలలో ఢిల్లీలోని నిజామొద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన ప్రార్థనలు కరోనా వైరస్ వ్యాధి సోకడానికి కారణమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంనుంచి ఈ ప్రార్థనలకు దాదాపు 700పైగా మంది హాజరయ్యారు. సామాజిక దూరం పాటించకపోవటమే వైరస్ వ్యాప్తికి కారణమని తెలుస్తోంది.
చదవండి : ‘ఇంకా 85 మంది ఆచూకీ తెలియాలి’
Comments
Please login to add a commentAdd a comment