
సాక్షి, అమరావతి : ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తుండడంతో ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా జెరూసలేం, మక్కా యాత్రలకు వెళ్లేవారికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాయని గుర్తు చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు ఆర్థిక సహాయం పెంచితే దానిని టీడీపీ, పచ్చ మీడియాలు వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఉనికి కోసం, విమర్శించడానికి ఏ విషయాలు లేక ఇలా మతపరమైన దుష్ప్రచారానికి దిగి, అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment