సాక్షి, తాడేపల్లి: లోకేష్‌కు పాదయాత్ర చేయడానికి ఏ అర్హత ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన లోకేష్ మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి. మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుబడిన మైనార్టీలకు సీఎం జగన్ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు.
‘‘వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీలకు ఆత్మగౌరవం. త్వరలోనే లక్ష మంది మైనార్టీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం. మైనార్టీలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ మైనార్టీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించారు. మైనార్టీలకి డిప్యూటీ సీఎం ఇచ్చారు.. 75 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్’’ అని మంత్రి అంజాద్ భాషా పేర్కొన్నారు.
చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment