పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ప్రజాదరణ ఏ విధంగా ఉందో తెలుసుకో
ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా
కడప కార్పొరేషన్: పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా హితవు పలికారు. గతంలో జగనన్న చెల్లిగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే కనీస స్పందన కూడా లేదన్నారు.
రాజన్న రాజ్యం స్థాపిస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె అక్కడి ప్రజలను, నాయకులను నట్టేట ముంచి ఎన్నికల్లో పోటీచేయకుండా అస్త్ర సన్యాసం చేసిందన్నారు. ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో శనివారం అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజులుగా షర్మిల వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్ జగన్‌ని, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నారు.
జగన్‌పై అభాండాలు దారుణం..
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొస్తే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి షర్మిల మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై సంబంధంలేని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోవచ్చేమోగానీ ప్రజలు మర్చిపోలేదన్నారు.
షర్మిల పరిస్థితి చూస్తే తమకే బాధేస్తోందని, జనాలు లేక చాలాచోట్ల మాట్లాడకుండానే ఆమె వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం బాబు మాయలో పడి వైఎస్ జగన్‌పై అభాండాలు దారుణమన్నారు. ఇష్టానుసారంగా సీఎం జగన్, అవినాష్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు హర్షించలేదన్న సత్యాన్ని ఆమె గ్రహించాలన్నారు.
కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అవినాష్‌రెడ్డిని హంతకుడని మాట్లాడటం అనైతికమని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంజద్‌బాషా చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలతో వేదికను పంచుకుంటూ బాబు స్క్రిప్టును చదవడం దారుణమన్నారు. షర్మిల, సునీత గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు.
Comments
Please login to add a commentAdd a comment