టీఆర్‌ఎస్ నేతలు బాధ్యతగా మాట్లాడాలి: పవన్ | trs leaders to speak the responsibility: Pawan | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ నేతలు బాధ్యతగా మాట్లాడాలి: పవన్

Published Mon, Apr 28 2014 2:17 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

టీఆర్‌ఎస్ నేతలు బాధ్యతగా మాట్లాడాలి: పవన్ - Sakshi

టీఆర్‌ఎస్ నేతలు బాధ్యతగా మాట్లాడాలి: పవన్

 సాక్షి, నెట్‌వర్క్: బంగారు తెలంగాణ సాధన  కోసం ఎన్ని మాటలైనా పడతానని, టీఆర్‌ఎస్ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బాధ్యత గల నేతలు అధికారంలోకి రావాలనే ఎన్డీఏకు మద్దతు పలికానన్నారు. ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సరికొత్త తెలంగాణ కోసం పోరాడతానని, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు.

సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, పెద్దిరెడ్డి, చేవెళ్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్, మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్‌లో ప్రచారం: పవన్ కల్యాణ్ ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో పర్యటించి బీజేపీ-టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. నరేంద్ర మోడీని ఒక్క మాట అన్నా సహించనని టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement