
చిటికేస్తే పవన్ వెయ్యి తునకలవుతడు
తనపై తీవ్ర విమర్శలు చేసిన సినీనటుడు పవన్‌కల్యాణ్‌పై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘‘ఓ లడ్‌కా నామ్ క్యా హై.. గదే చిరంజీవి తమ్ముడు.. బోడి సినిమా యాక్టర్.. గాని సిన్మ కూడా నేను సూడలేదు. కేసీఆర్ తాటతీసే మగాడా పవన్.. అరె.. కేసీఆర్ చిటికగొడ్తె వాడు వెయ్యి తునకలైతడు. కళ్లు నెత్తికెక్కి, గర్వంతో మాట్లాడుతున్నడు.
తెలంగాణ గడ్డ మీద నిలబడి కేసీఆర్‌ను తాట తీస్తానంటడా.. ఎంత ధైర్యం. నాల్గు రోజులు ఆగు.. ఎవడి తాట ఎవడు తీస్తాడో తెలుస్తది. సినిమా పరిశ్రమ ఆయనను బహిష్కరించాలె’’ అంటూ నిప్పులు చెరిగారు. అలాంటి సొల్లుగాళ్లతో ఏమైతదని అన్నారు.