టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అధికారం రానేరాదని, గాంధీభవన్‌కు తాళాలు వేసుకోక తప్పదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులెవరూ కాంగ్రెస్‌కు ఓటేయరని అన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటున్నారని, కానీ, ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఎలా దించాలనేదానిపై గాంధీభవన్‌లో నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైందన్నారు. ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఉత్తమ్‌కి గిరిజన డిక్లరేషన్ విడుదల చేసే నైతిక హక్కు లేదని, కామారెడ్డి గిరిజన డిక్లరేషన్ హాస్యాస్పదమన్నారు. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనట్టు, టీఆర్‌ఎస్ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటిదాకా గిరిజనులను వంచించిన కాంగ్రెస్‌పార్టీ, అదే వంచనా తీరును కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గిరిజనులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment