Ramulu Naik
-
వైరా బీఆర్ఎస్లో అసమ్మతి సెగలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్లో వైరం ఆరని మంటలా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించక.. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్‌కు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గం మండిపడింది. తమ సత్తా చూపిస్తామని శప థం చేసింది. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగింపులతో శాంతించి.. కలిసి పనిచేస్తామని వెల్లడించింది. ఇంతలోనే శుక్రవారం ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్య లు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రధానంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచింది. టికెట్ ఆశించి భంగపడి.. బీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు ప్రకటించకముందే వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు టికెట్ రాదనే ప్రచారం మొదలైంది. ఈక్రమంలో ఎమ్మెల్యే తనకే టికెట్ ఇవ్వాలంటూ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా రాయబారాలు నడపడంతో పాటు తన తనయుడితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ తర్వాత పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టికెట్ కేటాయించింది. దీంతో తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే... రానున్న ఎన్నికల్లో తానేంటో చూపిస్తానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనిపై అధిష్టానం బుజ్జగించడంతో కొంత మెత్తపడిన ఆయన, పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. దీంతో అంతా సర్దుకున్నట్లేనని అధిష్టానం సహా అందరూ భావించారు. దళితబంధు రగడ నియోజకవర్గాల్లో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే ఆధ్వర్యానే జరుగుతోంది. వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కలిపి 1,120 మంది తో పేర్లతో ఎమ్మెల్యే రాములునాయక్‌ను జాబితా ను అధికారులకు పంపినట్లు తెలిసింది. ఈ జాబితా ప్రకారమే యూనిట్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే భావిస్తుండగా, కొందరిని ఎంపిక చేసే అవకాశం పార్టీ అభ్యర్థి మదన్‌లాల్‌కు అధిష్టానం ఇచ్చిందన్న సమాచారంతో ఎమ్మెల్యే భగ్గుమన్నారు. గతంలో ఇక్కడ దళితబంధు అర్హుల ఎంపికలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలతో మదన్‌లాల్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే తన ప్రతిపాదనలను పక్కన పెడుతున్నారంటూ మదన్‌లాల్‌తో పాటు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై శుక్రవారం నాటి సమావేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చెడిన సయోధ్య ఎమ్మెల్యే రాములునాయక్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య ఉన్న సయోధ్య చెడినట్లయింది. ఈ పరిస్థితితో ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కరొక్కరుగా మదన్‌లాల్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవాల్సి ఉండగా.. రెండు వర్గాల పోరు మొదలవడం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యే, అభ్యర్థి నడుమ మధ్య పంచాయితీకి దారితీసిన పరిస్థితులపై ఆరా తీయడమే కాక... ఆచితూచి వ్యవహరించాలని మదన్‌లాల్‌కు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రకటించిన అభ్యర్థి మదన్‌లాల్ వ్యవహార శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దళితబంధు లబ్ధిదారుల జాబితా విషయాన్ని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రస్తావించడంతో ఎమ్మెల్యేలు చెప్పిన అధికార పార్టీ నేతలకే లబ్ధి చేకూరుతోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అభ్యర్థిని ప్రకటించిన కొన్నాళ్లకే వైరా నియోజకవర్గంలో మొదలైన ఈ విభేదాలను బీఆర్ఎస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
నేను సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్‌గా మార్చకండి
సాక్షి, ఖమ్మం: తాను ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌లాగా పనిచేశానని, తనలో ఉన్న హార్డ్‌వేర్‌ను బయటకు తీయొద్దని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై హార్డ్‌వేర్ ప్రయోగిస్తానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారడానికి కార్యకర్తలు ఎవరూ ప్రయత్నించవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని చెప్పారు. వైరా నుంచి తిరిగి తనను రెండోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దార్నా శేఖర్, బాణాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, పవిత్రకుమారి, లక్ష్మీబాయి, రామారావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి) -
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
సాక్షి, ఖమ్మం: వైరా ఎమ్మెల్యే మరోసారి నోరుజారారు. కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని శ్రీసిటీలో ఆదివారం ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆవేశంగా మాట్లాడిన ఆయన పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరుగుతున్న వరుస మీటింగ్‌లలో ఎమ్మెల్యే అదుపుతప్పి మాట్లాడుతూ వివాదాస్పదంగా నిలుస్తున్నారు. చదవండి: (పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య) -
సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘పార్టీలకతీతంగా ఈ రోజు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి (రూ.1,16,000) చెక్కులు పంపారు. ఎస్.. నేను సీఎంగా ఉన్నా.. మీ సాదకబాధకాల్లో ఉంటానని చెక్కులు పంపించారు. కేసీఆర్ తన, మన తేడా లేకుండా అందరి గురించి ఆలోచన చేసే సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఆయన్ను ఆశీర్వదిస్తున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిని చేశాయి. మూడోసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతారనడంలో అతిశయోక్తిలేదు. ఇంత ఆలోచన చేశాక.. కేసీఆర్ గురించి మీరు కూడా ఆలోచించాలిగా.. ఎవరైనా, ఏ భావజాలంవారైన కావచ్చు’’ అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వ్యాఖ్యానించారు. ‘‘నక్సల్స్ అయినా కావచ్చు.. ఎన్టీ రామారావు ఏమన్నారు.. నక్సల్స్ కూడా దేశభక్తులే అన్నారు.. ఆయనకు నమస్కారం చేయాలి. ఎస్.. అది కరెక్ట్ భావజాలం. ఎక్కడైనా అభివృద్ధికి సపోర్ట్ చేయాల్సిందే. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఆమెకు థాంక్స్ చెప్పాలి’’ అన్నారు రాములునాయక్. మంగళవారం ఖమ్మం జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు' -
'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు'
ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేస్తే డబ్బులు ఇస్తామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం వైరాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాములు నాయక్..ఓటర్లకు డబ్బులు పంచాలని బహిరంగంగానే నేతలకు సూచించారు. ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నా..'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం' ఇందులో భయపడాల్సిన పనేం లేదని పేర్కొన్నారు. ‘ఓటర్లను ఏ, బీ, సీ, డీ గా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునే వాళ్లను, అనుమానం ఉన్నవాళ్లను గుర్తించండి. వారికి డబ్బులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌హల్‌గా మారాయి.డబ్బుతో ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రేపు (ఆదివారం)ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. చదవండి : (ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ విషయాలు తెలుసా?) (తెలంగాణ అసెంబ్లీ గరంగరం!) -
మేం కూడా హిందువులమే.. ఇద్దర్నీ గెలిపించండి!
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్‌లను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. చిన్నారెడ్డి నిజాయితీ గల వ్యక్తని, వ్యవసాయ రంగంపై పీహెచ్డీ చేసిన వ్యక్తని అన్నారు. రాజకీయాలు మొత్తం కమర్షియలైన ఈ సమయంలో ఏ మాత్రం ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తని కొనియాడారు. రాములు నాయక్ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. చిన్నారెడ్డి, రాములు నాయక్‌లు నిజమైన తెలంగాణ వాదులని, ఇద్దర్నీ గెలిపించాలని ఉత్తమ్ కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బకు ఈ ప్రకటన చేశారు. కానీ, ఇవ్వలేదు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా దెబ్బ కొడితే రావాల్సిన 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఇవన్నీ రావాలంటే టీఆర్ఎస్ని చిత్తు చిత్తుగా ఓడించాలి. పీఆర్సీ కూడా నివేదిక ఇచ్చింది. ఉద్యోగాల ఖాళీలు భారీగా ఉన్నాయని చెప్పింది. ( ఎమ్మెల్సీ ఎన్నికలు; వ్యూహరచనలో కాంగ్రెస్ ) 43 శాతం ఫిట్మెంట్ తగ్గితే టీఆర్ఎస్ని ఓడించండి. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తగ్గింది. అందుకే టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే విధంగా రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండి. బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని తీసుకురావడంలో బండి సంజయ్ విఫలమయ్యారు. మేము కూడా హిందువులమే.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. భద్రాచలం రామాలయం భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది కేంద్రమే. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ని ఓడించాలి. విద్యా వ్యాపారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క పైసా పని చేయలేదు’’ అని అన్నారు. -
రాములు నాయక్ దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గిరిజన రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఒక రోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో పోలీసు పహారా మధ్య ఆయన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు. సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ వీ హెచ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు అయితే గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారి హక్కులు కాల రాస్తున్నా పట్టించుకోవడం లేదనివిమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాములు నాయక్ దీక్ష ప్రకటించిన నేపథ్యంలో కౌంటర్ వేస్తామని సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. -
‘మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : మెట్రో పిల్లర్ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని, దీనికి కారణమైన ఎల్ అండ్ టీపై మర్డర్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న అమీర్‌పేట మెట్రో స్టేషన్లో కాంక్రీట్ పడి చనిపోయిన మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ సందర్శించి ఓదార్చకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. ‘నాణ్యత లోపం వల్ల ఈ సంఘటన జరిగింది. మెట్రో స్టేషన్ నిర్మించి రెండేళ్లు కాకుండానే ఇలా జరిగింది. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళనలో ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టత ఇవ్వాలి. మెట్రో రైల్‌ని ప్రధాని మోదీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఇలా జరిగింది. దీనిపై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో పెచ్చులు ఊడిపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనుకే నిన్న ఒక అమ్మాయి చనిపోయింది. ప్రభుత్వం వెంటనే మౌనిక కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి’ అని శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్) ఉద్యోగులను కుక్కలతో పోల్చుడం సిగ్గు చేటు : రాములు నాయక్ అసెంబ్లీలో బట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరును మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉద్యోగులను కుక్కలతో పోల్చడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినప్పుడేమో ఉద్యోగులు దేవుళ్లలా కనిపించారు.. ఇప్పుడేమో దెయ్యాల కనిపిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె వల్లే రాష్ట్రం వచ్చిందని మరిచిపోవదన్నారు. ధనిక లేబర్ డిపార్ట్మెంట్ అంటూనే ఆరేళ్లుగా కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ లేదని, కుటుంబ తెలంగాణ, బేకారు తెలంగాణగా రాష్ట్రం తయారయ్యిందని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత దొరల పాలన తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలి నుంచి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపిస్తూ.. శాసనమండలి చైర్మన్ అతన్ని అనర్హుడినిగా పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గవర్నర్ కోటాలో ఎన్నికయిన తనపై చట్ట విరుద్ధంగా వేటు వేశారని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని తీర్పును వెలువరించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం రాములు నాయక్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ కుర్షిద్ రాములు తరఫున ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. దీంతో ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి, మండలి ఛైర్మన్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. -
ఆ ఇద్దరికి హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్ : అనర్హతకు గురైన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై అనర్హత వేటు వేయడంపై రాములు నాయక్, యాదవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. రాములు నాయక్, యాదవరెడ్డిలను అనర్హులుగా పేర్కొంటూ శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని కోర్టు తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది.. తాము సుప్రీం కోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆపాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థనను ఎన్నికల సంఘానికి తెలపాలని ఈసీ తరఫు న్యాయవాదికి సూచించింది. -
అప్పుడు నా జీతం రూ.147 : ఎమ్మెల్యే
నాడు ప్రజా రక్షకుడిని.. నేడు ప్రజా సేవకుడిని కష్టాలు, కన్నీళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించా.. ప్రజలతో మమేకం కావడమంటే నాకెంతో ఇష్టం పర్సనల్ టైమ్‌లో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ‘నా చిన్ననాటి జీవితం పుట్టెడు కష్టాలతో ప్రారంభమైంది. వ్యవసాయ కుటుంబం కావడంతో కరువు కాటకాలతో మొక్కజొన్న అన్నం, జొన్నరొట్టెతో కడుపు నింపుకున్నా. కష్టాలను, కన్నీళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించా. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత నాకు అక్షరాలా వర్తిస్తుంది. కష్టాల కడలి నుంచి కానిస్టేబుల్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించా. పోలీస్ శాఖలో పని చేసినంత కాలం అనేక క్రీడా పోటీల్లో పాల్గొని అథ్లెటిక్స్ చాంపియన్‌గా బహుమతులు గెలుచుకున్నా. రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనేక అవార్డులు దక్కించుకున్నా. నాడు ప్రజా పోలీస్‌గా.. నేడు ప్రజా సేవకుడిగా సేవచేసే మహోన్నత అవకాశం నాకు దక్కింది. ఇది ఎంతో సంతృప్తినిస్తోంది’ అంటున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో ఈ వారం పర్సనల్ టైమ్. సాక్షిప్రతినిధి, ఖమ్మం: కనీస సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గ్రామమైన జూలూరుపాడు మండలం పాపకొల్లు మా సొంతూరు. చిన్నప్పుడు కనీస వసతులు లేక పాఠశాలకు వెళ్లడానికి సైతం అనేక ప్రయాసలకు గురైన దీనస్థితి. వాటిని తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది. ఏ హోదాలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పం, సేవాభావమే నన్ను ఎమ్మెల్యేగా చేసింది. వ్యవసాయ కుటుంబం మాది. అనేక కష్టాలకోర్చి జీవనం సాగించిన కుటుంబం మాది. బాల్య దశలో కరువును సైతం మా కుటుంబం అనుభవించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మొక్కజొన్న అన్నం, జొన్న రొట్టెలతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కరువుతో కూడిన చీకటి రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. సుశిక్షితులైన పోలీస్ అధికారుల నేతృత్వంలో పోలీస్ ఉద్యోగం నిర్వహించడం వల్ల అనేక అంశాలపై పట్టు లభించింది. ఈ పని రాములునాయక్ మాత్రమే చేయగలుగుతాడు. ఈ క్లిష్ట సమస్యను ప్రజలతో ఒప్పించగలిగే నేర్పు అతడి సొంతం అనే స్థాయిలో పోలీస్ శాఖలో నా పనితీరు ఉండేది. అనేక క్లిష్ట సమయాల్లో ప్రజలను సమాధానపరచడానికి, పోలీస్ పరంగా వారి సహకారం తీసుకోవడానికి పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆ బాధ్యతను నాపైనే ఉంచడం ఇప్పటికీ నాకెంతో ఆనందాన్ని, ఒకింత గర్వాన్ని ఇస్తుంది. ప్రజల్లో ఒకడిగా నన్ను ఆయా ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకున్న తీరు సైతం ఎంతో సంతృప్తినిచ్చే అంశం.. పోలీస్ పరంగా ప్రజల నుంచి కావాల్సిన సహకారాన్ని వారికి వివరించే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం పోలీసు అధికారులు దృష్టికి నిక్కచ్చిగా.. నిర్మొహమాటంగా తీసుకెళ్లడంతో పోలీస్ శాఖలో నన్ను ప్రజా పోలీస్ అనేవాళ్లు. విషయాన్ని నిర్మొహమాటంగా, సున్నితంగా సందర్భాన్నిబట్టి ఇటు పోలీస్ అధికారులకు, అటు ప్రజలకు వివరించడం వల్ల అనేక సమస్యలను అధిగమించిన పరిస్థితి ఉండేది. ఉద్యోగపరంగా మారుమూల గ్రామాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు మాకు కేవలం పోలీస్ స్టేషన్లో ఉండే వైర్లెస్ సెట్ మాత్రమే మార్గం. నేను పనిచేస్తున్న ప్రాంతం నుంచి మా సొంతూరి పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్‌కు సెట్లో మాట్లాడి.. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం. కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రత ఉన్నా వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడి సాటి ఉద్యోగుల సహకారంతో కుటుంబ సమస్యలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మాది ఉమ్మడి కుటుంబం. సోదరులందరం కలిసే ఉండేవాళ్లం. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య మాకు ఆత్మీయతానుబంధాలు ఎక్కువ. రూ.147 వేతనంతో.. రూ.147 నెలసరి వేతనంతో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పిల్లలను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ఉండేది. అందుకు అనుగుణంగానే నా కుమారుడు జీవన్ సివిల్ సర్వీస్‌లో ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిలో ఝాన్సీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. జయశ్రీ ఆబ్కారీ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో నా సతీమణి రాంబాయి పాత్ర కీలకం. నేను పోలీస్ ఉద్యోగంలో మారుమూల గ్రామంలో పనిచేస్తున్నా.. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా ఓర్పు.. నేర్పుతో ఆవిడ వ్యవహరించేది. ఇప్పుడు నేను రాజకీయాల్లో తలమునకలైనా కుటుంబ విషయాలు, అవసరాలు ఆవిడే చూసుకుంటుంది. ఆవిడ సహకారం వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి సమయాన్ని వెచ్చించగలుగుతున్నా. నాకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. జీవితంలో అత్యంత సంతోషం కలిగిన రోజు జీవన్‌కు సివిల్ సర్వీస్‌లో ర్యాంకు లభించిన రోజు. ఇక పోలీస్ శాఖలో దాదాపు 37 ఏళ్లు వివిధ హోదాల్లో సేవలందించా.. ఇప్పటికీ పోలీస్ శాఖలో నాకు అన్ని హోదాల్లో మంచి మిత్రులున్నారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతోపాటు కుటుంబ విషయాలను మాట్లాడుకోవడం ఇప్పటికీ నాకు రివాజు. అనేక మంది నాతో పనిచేసిన సహచరులు వివిధ హోదాల్లో ఉన్నారు. వారి ద్వారా ప్రజా సమస్యలను సైతం తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పట్లో నాకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఉండడంతో సీనియార్టీ ద్వారానే పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం లభించింది. అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజల పక్షాన పనిచేసే.. వారికి సేవచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉంటుంది. ఇక సేవా కార్యక్రమాల నిర్వహణ నా జీవితంలో ఒక భాగంగా మారింది. పోలీస్ శాఖలో ఏ హోదాలో ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా.. ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నది నా తపన. అందుకోసం అనేక ప్రాంతాల్లో వందలాది మందికి కంటి చికిత్సలు చేయించా. రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండేందుకు నావంతు సహకారం అందించా. పోలీస్ శాఖలో పని చేసినంత కాలం అథ్లెటిక్స్ చాంపియన్‌గా అనేక పోటీల్లో పాల్గొని అవార్డులు సాధించాను. విశేషం ఏమిటంటే.. మా ముగ్గురు పిల్లలు సైతం క్రీడాకారులే. అథ్లెటిక్స్‌లో వారిది అందెవేసిన చేయి. అయితే వారంతా తమ ప్రతిభ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. క్రీడా కోటాను ఉపయోగించుకోలేదు. ఇక అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు సమయం చిక్కినా పెండింగ్ సమస్యలపై, కుటుంబ అవసరాలపై దృష్టి సారించడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తా. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడక కొన్ని ఏళ్లయింది. ఏ సినిమా చూడాలన్నా పిల్లలు ఇంట్లోనే చూసే వెసులుబాటు కల్పించారు. ప్రజాప్రతినిధిగా విద్యాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి మారుమూల గ్రామంలో విద్య పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలనేది నా ఆకాంక్ష. నాకు లభించే ప్రతి అవకాశం అందుకోసమే వినియోగిస్తా. -
కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్టు ఇచ్చిన డీఎస్..!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లిన డీఎస్.. శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టీ నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కలిసి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై డీఎస్ దిమ్మతిరిగే ట్విస్టు ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. అనేక మంది నాయకులను సహజంగానే తాను కలుస్తుంటానని, ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని కలిశానని డీఎస్ వివరణ ఇచ్చారు. అయితే, వ్యూహాత్మకంగానే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంపీగా అనర్హత వేటును తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా డీఎస్ చేరలేదని భావిస్తున్నారు. రాహుల్‌తో భేటీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోవడానికి ఎంపీ పదవే కారణమని తెలుస్తోంది. డీఎస్ టీఆర్ఎస్ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో శనివారం ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. డీఎస్ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానంతోపాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరటం, టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ గూటికి నర్సారెడ్డి, రాములు నాయక్..! ఇక, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.నర్సారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా నర్సారెడ్డి.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు అలెర్టయ్యారు. సీనియర్ నేతలు సుప్రభాత్రావు, బట్టి జగపతి, చంద్రపాల్ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కృష్ణయ్య, తుల ఉమ కూడా? ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వేములవాడ నుంచి టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం. -
కేసీఆర్‌కు గిరిజనులే బుద్ధి చెబుతారు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, కేసీఆర్‌కు గిరిజనులే బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏడు కోట్ల రూపాయలను ముందే పంపించారని ఆరోపించారు. రాములునాయక్ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ ద్రోహులను వెంటేసుకుని తిరగడం సరైంది కాదని చెప్పినందుకే నన్ను టీఆర్ఎస్ నుంచి తప్పించా రు. కేసీఆర్ కుటుంబానికి గిరిజనులు, దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు. కేటీఆర్ అంబేడ్కర్ గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన దళిత నాయకుల వేడుకల్లో సీఎం ఎప్పుడైనా పాల్గొన్నారా? నాలుగేళ్లలో అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొనలేదు’ అని విమర్శించారు. -
‘నేను ఓడిపోతే ఉరేసుకుంటా’
హైదరాబాద్: నారాయణఖేడ్‌లో నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా, భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చెయ్..నేను ఓడిపోతే ఉరేసుకుంటానని సస్పెండైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సవాల్ విసిరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో టీఆర్ఎస్ అధిష్టానం, రాములు నాయక్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో రాములు నాయక్ బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ నేతలను కలిశానంటున్నారు..ఎవరు ఎవరితో కలిశారో నార్కో టెస్ట్ చేయించుకుందామా అని సూటిగా అడిగారు. తనకు ఏ టికెట్ అవసరం లేదు..ఈ ఎన్నికల్లో పోటీచేయనని వ్యాక్యానించారు. తనకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లు మాత్రమేనని వెల్లడించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి అబద్ధాల పుట్టగా అభివర్ణిస్తున్నట్లు చెప్పారు. 1200 మంది అమరుల ఆత్మ నిన్నటి వర్ష రూపంలో కురిసిందన్నారు. కొత్త వాగ్దానాలంతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ బయలు దేరిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలన్నారు..నిధులు పార్టీలో కొంతమందికే వచ్చాయని ఆరోపించారు. నియామకాలు ఎటుపోయాయో తెలియదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల అని శాపనార్ధాలు పెట్టారు. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నిమిషాల్లో కేటీఆర్ బొందపెట్టారని మండిపడ్డారు. ఎలాంటి షోకాజ్ ఇవ్వకుండా అహంకారంతో తనను సస్పెండ్ చేశారని వాపోయారు. తండాలు, గూడేలకే ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రెండు కులాల మధ్య గతంలో ఏ ముఖ్యమంత్రి చిచ్చుపెట్టలేదని, గోండులకు..లంబాడాలకు, యాదవులకు..కురుమలకు, బెస్తలకు..ముదిరాజ్‌లకు మధ్య చిచ్చుపెట్టారని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 25 నుంచి 30 సీట్లకు మించిరావని జోస్యం చెప్పారు. టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 70 మంది కుంటి గుర్రాలేనని వ్యాక్యానించారు. తెలంగాణ నేతలు ఆలె నరేంద్ర, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవ్ రావ్ జాదవ్‌లు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు కానీ హరికృష్ణ చనిపోతే ముఖ్యమంత్రి కుటుంబమంతా వెళ్లారని మండిపడ్డారు. రేపటి నుంచి నామీద భౌతిక దాడులు..ప్రెస్మీట్ల ద్వారా దాడి చేయిస్తారని ఆరోపించారు. నాకుటుంబ సభ్యులకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు. -
భూపాల్‌రెడ్డిని ఇబ్బంది పెట్టినందుకే..
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని ఇబ్బందులకు గురి చేసినందుకే ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెం డ్ చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ వెల్లడించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదనే అక్కసుతోనే రాములు నాయక్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులంతా తన వెంట ఉన్నారని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయనకు అంత స్థాయి లేదని విమర్శించారు. -
టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు
-
టీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయింపు వ్యవహారంలో తలెత్తిన అసమ్మతికి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాములు నాయక్ ఖండించారు. ఓ దశలో కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గత నెల మొదటి వారంలో విడుదల చేసిన టీఆర్ఎస్... నారాయణఖేడ్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేరును మరోమారు ఖరారు చేసింది. అయితే భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని రాములు నాయక్ వ్యతిరేకించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మార్చాలంటూ తన వర్గానికి చెందిన కొందరు నేతలతో కలసి ప్రత్యేక సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించారు. అలాగే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దాదాపు పక్షం రోజులుగా రాములు నాయక్‌తో పార్టీ అధిష్టానం మంతనాలు జరుపుతోందని, త్వరలో ఖేడ్‌లో తలెత్తిన అసమ్మతి సమసిపోతుందని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ రాములు నాయక్‌ను పార్టీ సస్పెండ్ చేయడంతో అయన అనుచరుల రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. కుంతియాతో భేటీయే కారణం? గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి రాములు నాయక్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాములు నాయక్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నారాయణఖేడ్ లేదా బోథ్ స్థానాల నుంచి టికెట్ ఆశించినట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రాములు నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్ కోరినట్లు ప్రచారం జరగ్గా దీన్ని ఆయన ఖండించారు. తన మిత్రుడిని కలవడానికే హోటల్‌కు వెళ్లినట్లు ఆదివారం రాత్రి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం రాములు నాయక్‌ను టీఆర్ఎస్ సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కొంతకాలంగా రాములు నాయక్ వర్గం పేరిట అసమ్మతి రాగం వినిపిస్తున్న కంగ్టి ఎంపీపీ రామారావు రాథోడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాములు నాయక్ వెంట నడుస్తూ వస్తున్న కంగ్టి జెడ్పీటీసీ సభ్యుడు రవి కుమార్, మల్శెట్టి యాదవ్ తదితరులు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. రాములు నాయక్ అనుచరుల్లో కొందరిని మంత్రి హరీశ్‌రావు ఇటీవల బుజ్జగించినట్లు సమాచారం. రాములు నాయక్ సస్పెన్షన్ వ్యవహారం నియోజకవర్గంలో కాస్త రాజకీయ వలసలకు దారితీస్తుందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: రాములు నాయక్ టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని.. ఆ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. టీఆర్ఎస్ తనపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేయడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నిర్మాణంలో ప్రతి రాయిపైనా తన పేరు ఉందన్నారు. తెలంగాణ ద్రోహి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరుతో తనను సస్పెండ్ చేయించడం చూసి బాధపడుతున్నానన్నారు. ‘టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను సస్పెండ్ చేస్తే గర్వపడేవాడిని. 2004, 2009, 2014, 2018లో టికెట్ అడిగా. అధిష్టానం ఇవ్వకపోపోయినా పార్టీ మారలేదు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికయ్యా. గిరిజనుల రిజర్వేషన్లు అడిగినందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్కు సేవ చేసినందుకు, గిరిజన రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసారా? గిరిజన మేధావులతో త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. నా జాతి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను ఎన్నికల్లో పోటీ చేయను. నాలాగా బాధపడుతున్న వాళ్లు టీఆర్ఎస్లో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ఏదో ఒకరోజు బయటకు వస్తారు’అని రాములు నాయక్ చెప్పారు. కేసీఆర్ చెప్పిన గిరిజన పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అతీగతీ లేదని, గిరిజనులను టాటా బిర్లా చేస్తామని ఈ నాలుగేళ్లలో బికారీలను చేశారని మండిపడ్డారు. ఒక్కరోజూ తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్లో ఉన్నారని, ఉద్యమ సమయంలో విద్యార్థులు తరిమికొట్టిన వారిని మంత్రి కేటీఆర్ తన కారులో తిప్పుకుంటూ వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నారని విమర్శించారు. స్నేహితులను కలిసేందుకే గోల్కొండ హోటల్‌కు వెళ్లానని, కుంతియాను కలవలేదని, అక్కడ రేవంత్, మధు యాష్కీ తనకు యాదృఛికంగా తారసపడ్డారనని రాములు నాయక్ చెప్పారు. -
టీఆర్ఎస్కు ఝలక్.. కాంగ్రెస్‌లోకి గులాబీ ఎమ్మెల్సీ!
-
టీఆర్ఎస్కు ఝలక్.. కాంగ్రెస్‌లోకి గులాబీ ఎమ్మెల్సీ!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ తెలంగాణలో వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలను ఆకర్షించేందుకు అధికార పార్టీ జోరుగా ప్రయత్నాలు చేస్తుండగా.. అధికార పార్టీలోని అసంతృప్త నేతలను గాలం వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి కుంతియాను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం. ఈ మేరకు హామీ రాగానే.. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముంది. -
గాంధీభవన్‌కు తాళాలు తప్పవు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అధికారం రానేరాదని, గాంధీభవన్‌కు తాళాలు వేసుకోక తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులెవరూ కాంగ్రెస్‌కు ఓటేయరని అన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటున్నారని, కానీ, ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఎలా దించాలనేదానిపై గాంధీభవన్‌లో నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైందన్నారు. ఉత్తరప్రదేశ్‌లాగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతుందని హెచ్చరించారు. ఉత్తమ్‌కి గిరిజన డిక్లరేషన్ విడుదల చేసే నైతిక హక్కు లేదని, కామారెడ్డి గిరిజన డిక్లరేషన్ హాస్యాస్పదమన్నారు. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనట్టు, టీఆర్ఎస్ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటిదాకా గిరిజనులను వంచించిన కాంగ్రెస్‌పార్టీ, అదే వంచనా తీరును కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గిరిజనులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటికలలు కంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గంజాయి, ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులు, దళితులకు కాంగ్రెస్ ఎప్పుడు అన్యాయమే చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న బస్సు యాత్రతో ఒరిగే ప్రయోజనమేమీ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కు అధికారం పగటి కల
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చా లని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం గిరిజనులకు ఎంతో మేలుచేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్పారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎప్పటికప్పుడు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ గిరిజనుల పాలిట దేవుడని అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 2019లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. గిరిజన తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా చేయాలని కేబినెట్లో తీర్మానించడం పట్ల సీఎంకు, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల ఎస్టీలు మూడు లక్షల ఉద్యోగాలు నష్టపోయారని పేర్కొన్నారు. ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించడం పట్ల గిరిజనులు రుణపడి ఉంటారన్నారు. -
'నిరుద్యోగులకు కానిస్టేబుల్ రాతపరీక్ష'
నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం జరిగిన పరీక్షా కేంద్రాలను రాములు నాయక్ మెదక్ డీఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు. -
మిస్‌ఫైర్‌పై కొనసాగుతున్న విచారణ
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : పట్టణంలోని మయూరి ఇన్‌లాడ్జ్‌లో ఆదివారం రాత్రి జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రాయికల్ ఎస్సై రాములునాయక్‌ను మంగళవారం స్థానిక పోలీసులు విచారించినట్లు సమాచారం. సోమవారం ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు డీఎస్పీ మాధవరెడ్డి, రూరల్ సీఐ రఘు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాడ్జిలోని 212 గదిని పరిశీలించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలడిగి తెలుసుకున్నారు. సోమవారం సేకరించిన ఆధారాల ప్రకారం మంగళవారం విచారణ కొనసాగించారు. అప్పటికే రాములునాయక్‌పై సెక్షన్ 286, 337 కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు ఎస్సై విచారణలో దోషిగా తేలితే చట్టపరమైన చర్యలతోపాటు శాఖ పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం...! కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములునాయక్ జిల్లా దాటి నిర్మల్‌కు రావడం, కుంటాల జలపాతంలో విందు చేసుకోవడం.. పైగా దీనికి అధికారికంగా సెలవు తీసుకోకుండా రావడం ఆయన విధినిర్వహణపై ఉన్న బాధ్యతను తెలియజేస్తోంది. ఆది నుంచి దూకుడు స్వభావంతో పనిచేసే ఎస్సైగా రాములునాయక్‌కు పేరుందని సమాచారం. విధి నిర్వహణలో భాగంగా అత్యవసర సమయంలో ఉపయోగించే సర్వీస్ రివాల్వర్ రెండు రౌండ్లు పేల్చడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే రివాల్వర్ నుంచి ఒక్క తూటా బయటపడిన అనంతరం అప్రమత్తమై మరోరౌండ్ తూటా పేలకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ వెనువెంటనే తుపాకీ నుంచి రెండు బుల్లెట్లు రావడం పలు సందేహాలకు తావిస్తోంది. సెటిల్మెంట్ కోసమేనా..? రాయికల్ ఎస్సై అసలు నిర్మల్‌కు ఎందుకు వచ్చినట్లు..? కరీంనగర్ జిల్లా ఎంఈవోలతో కలిసి కుం టాల జలపాతానికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణం లో నిర్మల్‌లో ఎందుకు ఆగారు..? ఆయనకు నిర్మల్ డివిజన్లోని ఎంపీడీవోలు, ఈవోపీర్డీలు లాడ్జీలో విం దు ఎందుకు ఏర్పాటుచేశారు..? వీరి కలయిక వెనక సెటిల్మెంట్ వ్యవహారం ఏమైనా దాగి ఉందా..! అ నేది పట్టణంలో చర్చనీయాంశమైంది. నిర్మల్ డివి జన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కొందరు ఎ న్నికల కంటే ముందు కరీంనగర్ జిల్లాలో పనిచేయడంతో ఎస్సైతో సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ బంధం ఏమైనా ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చిందా..? అయితే.. ఒకే గదిలో ఉద్యోగులతో కలిసి విందు చేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎస్సై రివాల్వర్ పేలడం ప్రమాదవశాత్తు జరిగింది కాదేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేటు పడే అవకాశం? : ఎస్సై రివాల్వర్ తూటాలు ఉపయోగిస్తే ఎందుకు, ఎప్పుడు వినియోగించారన్న పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన లెక్కచూపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఎస్సైపై వేటువేసేందుకే ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
మండలిలో పెరిగిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో టీఆర్ఎస్ బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం 35 మంది సభ్యులున్న మండలిలో ఇప్పటిదాకా టీఆర్ఎస్కు ఏడుగురు సభ్యులు ఉండగా... వివిధ పార్టీలకు, సంఘాలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలు చేరడంతో ఆ సంఖ్య 16కు చేరింది. దీనితో వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే శాసనమండలి చైర్మన్‌గా కె.స్వామిగౌడ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌కు రాజీనామా చేయాల్సిందిగా సంకేతాలు పంపాలని సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యులకు సూచనలు ఇచ్చారు. టీఎన్జీవోల అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీగా చేయడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకుని.. ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలను అప్పగిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మిగతా ఏడు ఖాళీల్లో గవర్నర్ కోటాలోని ఇద్దరు సభ్యులను (నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్) భర్తీచేశారు. స్థానిక సంస్థల కోటాలోని ఐదు పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 35 మంది సభ్యులున్న మండలిలో టీఆర్ఎస్కు 16 మంది (ఎమ్మెల్సీ కె.దిలీప్ సాంకేతికంగా టీఆర్ఎస్ సభ్యుడిగానే వ్యవహరిస్తున్నారు) ఉన్నారు. కాంగ్రెస్‌కు 12 మంది, టీడీపీకి నలుగురు, ఎంఐఎంకు ఇద్దరు, పీడీఎఫ్‌కు ఒకరు ఉన్నారు. చైర్మన్ నేతి విద్యాసాగర్ గౌరవంగా రాజీనామా చేయకుంటే సంఖ్యాబలం కోసం ఎంఐఎం, పీడీఎఫ్(2+1) మద్దతు తీసుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.