సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్‌లకు అవకాశం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం రాత్రి వీరి పేర్లను గవర్నర్ నరసింహన్‌కు సిఫారసు చేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తనకు అండగా నిలబడిన నాయిని ఏ సభలో సభ్యుడు కానప్పటికి కేసీఆర్ ఆయన కు హోంశాఖను అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడాయనను మండలికి నామినేట్ చేశారు. ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఓసీలకు కేటాయించినందువల్ల రెండో దానిని ఎస్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాములు నాయక్‌ను ఎంపిక చేశారు.