తెలంగాణ కోసం కేసీఆర్ వెంటే నడిచాను: నాయిని
తెలంగాణ కోసం కేసీఆర్ వెంటే నడిచాను: నాయిని
Published Sun, Jun 22 2014 2:10 PM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM
హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ హోంశాఖామంత్రి నాయిని నర్సింహరెడ్డి, రాములు నాయక్లు ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటి సీఎం మహ్మద్ ఆలి, ఈటెల, జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 2001 నుంచి తెలంగాణ కోసం నాయిని, రాములు నాయక్ లు కేసీఆర్ వెంట నడిచారు అని అన్నారు. నాయిని, రాంనాయక్ లకు ఎమ్మెల్సీలు ఇచ్చి గౌవరవించడం టీఆర్ఎస్ పార్టీ కమిట్ మెంట్‌కు నిదర్శనమని ఈటెల తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 నుంచి పోరాటం చేశాను. అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేదించింనపుడు.. కేసీఆర్ పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. 2001 నుంచి కేసీఆర్ వెంటే నడిచాను అని నాయిని అన్నారు. గిరిజనుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషిస్తున్నారని మరో ఎమ్మెల్సీ రాములు నాయక్ మీడియాకు వెల్లడించారు.
Advertisement