టీఆర్‌ఎస్‌కు ఝలక్‌‌.. కాంగ్రెస్‌లోకి గులాబీ ఎమ్మెల్సీ! | TRS MLC Ramulu Naik To Join Congress? | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 14 2018 12:52 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS MLC Ramulu Naik To Join Congress? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల వేళ తెలంగాణలో వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలను ఆకర్షించేందుకు అధికార పార్టీ జోరుగా ప్రయత్నాలు చేస్తుండగా.. అధికార పార్టీలోని అసంతృప్త నేతలను గాలం వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ రాముల్‌ నాయక్‌ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి కుంతియాను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం. ఈ మేరకు హామీ రాగానే.. త్వరలోనే కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement