సాక్షి, హైదరాబాద్: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చా లని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం గిరిజనులకు ఎంతో మేలుచేస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్పారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎప్పటికప్పుడు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ గిరిజనుల పాలిట దేవుడని అన్నారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 2019లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు.
గిరిజన తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా చేయాలని కేబినెట్‌లో తీర్మానించడం పట్ల సీఎంకు, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల ఎస్టీలు మూడు లక్షల ఉద్యోగాలు నష్టపోయారని పేర్కొన్నారు. ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించడం పట్ల గిరిజనులు రుణపడి ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment