తెలంగాణ శాసన మండలికి హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమతి పొలిట్ బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఎంపికయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలికి హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమతి పొలిట్ బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఎంపికయ్యారు. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో ఏ సభలోనూ సభ్యుడు కాని నాయిని నరసింహా రెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తన కేబినెట్లోకి తీసుకుని కీలక శాఖ అప్పగించారు. తాజాగా శాసన మండలికి నాయిని ఎంపికయ్యారు.