నిత్య పెళ్లికొడుక్కి షాక్‌ | TRS Suspend Srinivas Reddy who got three Marriages | Sakshi
Sakshi News home page

నిత్య పెళ్లికొడుక్కి షాక్‌

Published Tue, Nov 21 2017 6:00 PM | Last Updated on Tue, Nov 21 2017 6:01 PM

TRS Suspend Srinivas Reddy who got three Marriages - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిత్య పెళ్లికొడుకు, తమ పార్టీ నేత శ్రీనివాస్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ షాకిచ్చింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు బోడుప్పల్‌ జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరెడ్డి తెలిపారు. శ్రీనివాస్‌ రెడ్డి రెండో భార్య సంగీతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీయిచ్చారు.

మరోవైపు సంగీతకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మేడ్చల్‌ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సంగీతకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆయన వెనుదిరిగారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు.

మూడు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటివద్ద తన రెండేళ్ల కూతురితో కలిసి సంగీత ఆందోళన చేస్తోంది. ఇంటికి తాళం వేసి అత్తమామలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది.

తనతో విడాకులు తీసుకోకుండా మూడో పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసేందుకు వచ్చిన సంగీత, ఆమె సోదరుడు రంజిత్‌రెడ్డిపై శ్రీనివాస్‌రెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగీత ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు ఆమె భర్త శ్రీనివాస్‌ రెడ్డి, మామ బాల్‌రెడ్డి, అత్త ఐలమ్మ, మూడో భార్య దేవిజగదీశ్వరిలపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement